Vishwambhara: బర్త్ డే సర్ప్రైజ్.. విశ్వంభరలో త్రిష పాత్ర పేరు రివీల్ చేసిన చిత్ర యూనిట్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నటి త్రిష పుట్టినరోజు (మే 4) సందర్భంగా ‘విశ్వంభర’ చిత్ర బృందం ఆమెకు సోషల్ మీడియా వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపింది. మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రంలో త్రిష కథానాయికగా నటిస్తోంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ త్రిషకు విషెస్ చెబుతూ సినిమాలో ఆమె పోషిస్తున్న పాత్ర పేరును కూడా వెల్లడించింది.
ఈ సినిమాలో త్రిష ‘అవని’ అనే పాత్రలో కనిపించబోతోంది. ఆమె నటన ఎంతో హుందాగా, మంత్రముగ్ధులను చేసే విధంగా ఉంటుందని చిత్ర బృందం పేర్కొంది. ‘బియాండ్ ది యూనివర్స్’ అనే ట్యాగ్‌లైన్‌తో వస్తున్న ఈ మెగా మాస్ చిత్రం త్వరలోనే థియేటర్లలోకి రాబోతున్నట్లు మేకర్స్ మరోసారి స్పష్టం చేశారు. దాదాపు దశాబ్ద కాలం తర్వాత చిరంజీవి, త్రిష జోడీ మళ్ళీ వెండితెరపై సందడి చేయనుండటంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. వశిష్ట దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. విజువల్ వండర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. తాజాగా విడుదల చేసిన బర్త్ డే పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Also Read
తాజావార్తలు
-
Nora Fatehi : జైలర్2లో స్పెషల్ సాంగ్.. అందాల విందు చేసి ఆరబోసిన నోరాఫతేహీ
-
Srikanth Odela: శ్రీకాంత్ ఓదెలపై నమ్మకం ఉంటుందా?.. నెక్ట్స్ హీరో ఎవరు?
-
Huawei Mate 90 Pro Max: హువావే Mate 90 Pro Max లాంచ్.. 200MP RYYB కెమెరా, 6,800mAh బ్యాటరీ, 6.9 అంగుళాల డిస్‌ప్లే
-
Smit Machchhar & Sandra Samuel: అప్పట్లో సాండ్రా శామ్యూల్, ఇప్పుడు స్మిత్ మచ్ఛార్..
-
BC Reservation: బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు సంచలన తీర్పు.. జీవోలు కొట్టివేత
ట్రెండింగ్
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?
-
Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్‌గా చేయండి ఇలా..!
-
Rohit Sharma Celebration: అది నా కోసం మాత్రమే, నేను చెప్పను.. జాగింగ్ సెలబ్రేషన్స్‌పై రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?
-
భారీ బ్యాటరీ, ఇమర్సివ్ డిస్ప్లేతో అక్టోబర్ 6న Vivo S2 FE లాంచ్‌కు రెడీ..!