No Release Date : ఈ సినిమాలు వచ్చేది ఎప్పుడు.. అసలు వస్తాయా?

Tollywood

Tollywood

భారీ విఎఫ్ఎక్స్ సినిమాలు మెగాస్టార్ చిరంజీవికి బొత్తిగా కలిసి రావడం లేదు. కోడి రామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన అంజి ఐదారేళ్ల పాటు చెక్కి చెక్కి తెస్తే ఎలాంటి రిజల్ట్ వచ్చిందో అందరికీ ఎరుకే. విశ్వంభర విషయంలోనూ ఫ్యాన్స్ ఇలాంటి ఆందోళనే చెందుతున్నారు. కానీ నో టెన్షన్ అంటున్నాడు డైరెక్టర్ వశిష్ట. సినిమా ఎప్పుడొచ్చినా బాక్సాఫీస్ బద్ధలైపోతుందని గట్టి హామీనే ఇస్తున్నాడు. ఈ మాటతో సినిమా రిలీజ్ లేట్ అవుతుందని హింట్ ఇచ్చినట్టైంది డైరెక్టర్.

2023లో విశ్వంభర స్టార్టైంది.. దీని వెనుక స్టార్టైన మన శంకర్ వరప్రసాద్ గారు ఈ సంక్రాంతికి వచ్చి బ్లాక్ బస్టరైంది. కానీ విశ్వంభర ఎప్పుడొస్తుందో మాత్రం సస్పెన్స్ వీడటం లేదు. ఈ సమ్మర్‌కు వస్తుందని చిరంజీవి స్వయంగా చెప్పారు.. కానీ రాలేదు. ఇంతలో బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న కాక రిలీజ్ డేట్ లాకయ్యింది. నెక్ట్స్ ఇయర్ జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. బాబీ మూవీ స్పీడ్ చూస్తుంటే కాక తర్వాతే విశ్వంభర వస్తుందా అనే డౌట్స్ కలుగుతున్నాయి. నిఖిల్ సిద్దార్థ్ కెరీర్‌లోనే హై బడ్జెట్ మూవీగా తెరకెక్కుతోన్న స్వయంభు రిలీజ్ డేట్ ఎప్పుడో కరెక్ట్‌గా చెప్పలేకపోతుంది మూవీ టీం. 2026 ఫిబ్రవరికి వస్తుందన్నారు.. తర్వాత తూచ్ అని ఏప్రిల్ 10న తెస్తామన్నారు. సమ్మర్ దాటి రెయినీ సీజన్ వచ్చినా స్వయంభు ప్రేక్షకుల ముందుకు ఎప్పుడోస్తుందో క్లారిటీ రాలేదు. వీఎఫ్ఎక్స్ కారణంగానే మూవీ డిలే అవుతుందని టీఎఫ్ఐ టాక్.

తండేల్‌తో వంద కోట్ల క్లబ్‌లోకి చేరిన నాగ చైతన్య నెక్ట్స్ ఫిల్మ్ వృష కర్మ విడుదల తేదీ రోజు రోజుకూ వెనక్కు వెళుతుందని సమాచారం. విరూపాక్ష ఫేమ్ కార్తీక్ దండు దర్శకత్వంలో రూ. 120 కోట్లతో తెరకెక్కుతోన్న అడ్వెంచరస్ థ్రిల్లర్ దసరా, దీపావళికి రిలీజ్ ప్లాన్ చేస్తున్నారని ఆ మధ్య రూమర్ నడిచింది. ఇప్పుడు తాజాగా డిసెంబర్ బరిలో కూడా దిగొచ్చన్న గాసిప్ నడుస్తోంది. ఇయర్ ఎండింగ్ రావాలంటే భారీ కాంపిటీషన్ తట్టుకోవాల్సి ఉంది. మరీ డేర్ చేసి అప్పుడే తెస్తారో.. ప్రీ పోన్ ఆర్ పోస్ట్ పోన్ చేస్తారో చూడాలి.