Site icon NTV Telugu

VishwakSen : ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చేసిన మెకానిక్ రాకీ.. ఎక్కడంటే..?

Mechanicrocky

Mechanicrocky

మాస్ కా దాస్ విశ్వక్ సేన్, ముద్దుగుమ్మలు మీనాక్షి చౌదరి, శ్రద్దా శ్రీనాథ్ గా నటించిన చిత్రం మెకానిక్ రాకి, నూతన దర్శకుడు రవితేజ ముళ్ళపూడి తెరకెక్కించిన సాలిడ్ ఎంటర్టైనర్ గత నెల 22న వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లో రిలీజ్ అయింది. ముందు రోజు ప్రీమియర్స్ తో రిలీజ్ అయిన ఈ సినిమా టాక్ బాగున్నప్పటికి బాక్సాఫీస్ పరంగా ప్లాప్ గా నిలిచింది. సెకండ్ హాఫ్ బాగున్నప్పటికీ ఫస్ట్ హ్లాఫ్ టతేలిపోవడంతో ప్రేక్షకులకు ఈ సినిమా అంతగా ఎక్కలేదు.

Also Read : SDT 18 : సాయిదుర్గ తేజ్ ఊచకోత చూస్తారు : రామ్ చరణ్

భారీ బడ్జెట్ పై తెరకెక్కిన ఈ సినిమా అటు బయ్యర్స్ కు నష్టాలే మిగిల్చింది. రిలీజ్ అయిన మొదటి వారంలోనే థియేటర్స్ రన్ ఫినిష్ చేసుకున్న ఈ సినిమా ఇపుడు ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ కి వచ్చేసింది. ఈ చిత్రం ఓటీటీ హక్కులు ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ విడుదలకు ముందుగానే కొనుగోలు చేసారు. ఈ శుక్రవారం నుండి ప్రైమ్ లో స్ట్రీమింగ్ కు తీసుకువచ్చింది అమెజాన్. జేక్స్ బిజొయ్ సంగీతం అందించిన ఈ సినిమాను ఎస్ ఆర్ టి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రజనీ తాళ్లూరి నిర్మించారు. ఎలాగూ వీకండ్ వస్తుంది థియేటర్స్ లో కూడా చెప్పుకోదగ్గ సినిమాలు లేవు, ఈ వారాంతానికి మెకానిక్ రాకిని చూస్తూ ఎంజాయ్ చేయండి.

Exit mobile version