Site icon NTV Telugu

విశ్వక్ సేన్ అలియాస్ దినేష్ నాయుడు

Vishwak Sen reveals his Original Name

నటుడు విశ్వక్ సేన్ తన అసలు పేరు రివీల్ చేశాడు. ‘ఫలక్ నామా దాస్’తో పేరు తెచ్చుకున్న విశ్వక్ సేన్ ‘హిట్’తో తొలి హిట్ కొట్టాడు. ఆరంభంలో ‘వెళ్ళిపోమాకె’, ‘ఈ నగరానికి ఏమైంది’ సినిమాల్లో నటించినా రాని గుర్తింపు ‘ఫలక్ నామాదాస్’తో వచ్చింది. ప్రస్తుతం విశ్వక్ నటించిన ‘పాగల్’ సినిమా విడుదలకు సిద్ధం అవుతోంది. ఇటీవల ఇతగాడు తన అసలు పేరును బయట పెట్టాడు. హైదరాబాద్ గాంధీ హాస్పటల్ లో పుట్టి దిల్ సుఖ్ నగర్ లో పెరిగిన విశ్వక్ అసలు పేరు దినేష్‌నాయుడు అట. పుట్టినపుడు తల్లిదండ్రులు తనకు పెట్టిన పేరు అదేనట. అయితే న్యూమరాలజీ ప్రకారం తనెంత కష్టపడ్డా ఆ పేరుతో ఫలితం దక్కదు అని తెలియటంతో తన తండ్రిని మరో పేరు పెట్టమని అడిగాడట. ఆయన నాలుగు పేర్లు ముందుంచి ఒకటి ఎంపిక చేసుకోమనటంతో తను విశ్వక్ సేన్ ని సెలక్ట్ చేసుకున్నట్లు చెబుతున్నాడు. నాలుగేళ్ళ క్రితమే దినేష్ నాయుడు నుంచి విశ్వక్ సేన్ గా మారానంటున్నాడు.

Exit mobile version