NTV Telugu Site icon

Laila : ‘లైలా’ యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్‌.. నా కెరీర్ లో మెమరబుల్ మూవీ : విశ్వక్సేన్

Vishwaksen

Vishwaksen

మాస్ కా దాస్ విశ్వక్సేన్ యూనిక్ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘లైలా’ ఎక్సయిటింగ్ ప్రమోషనల్ కంటెంట్‌తో స్ట్రాంగ్ బజ్ క్రియేట్ చేస్తోంది. ఈ చిత్రానికి రామ్ నారాయణ్ దర్శకత్వం వహించారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మించారు. ఆకాంక్ష శర్మ హీరోయిన్ గా నటిస్తోంది. పాటలు చార్ట్ బస్టర్ హిట్ అయ్యాయి. లైలా ఫిబ్రవరి 14న బిగ్ స్క్రీన్స్ లో విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో విశ్వక్సేన్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాల్ని పంచుకున్నారు.

లేడీ గెటప్ చేయాలనే కోరిక మీకు ముందునుంచి ఉండదని విన్నాం?
-ఆర్టిస్ట్ గా కొన్ని పాత్రలు చేయాలని ప్రతి నటుడికి ఉంటుంది. భామనే సత్యభామనే, మేడం, చిత్రం భళారే విచిత్రం, రెమో సినిమాలు చూసినప్పుడు ఆర్టిస్టుగా ఇలాంటి గెటప్ చేయాలని ఉండేది. అలాగే ఆడియన్స్ ఇప్పుడు కొత్త కథలని, థీమ్స్ ని కోరుకుంటున్నారు. ఇలాంటి సినిమాలురాక దాదాపుగా రెండు దశాబ్దాలు అవుతుంది. ఈ జనరేషన్ లో ఒక హీరో అమ్మాయి పాత్ర వేయడం గత 20 ఏళ్లుగా మనం చూడలేదు. ఆ లోటుని భర్తీ చేయాలని ఒక మంచి కథ రావడంతో ఈ సినిమా చేయడం జరిగింది.

లేడీ గెటప్ లోకి మారడానికి మీకు ఎంత సమయం పట్టింది?
-దాదాపు రెండున్నర గంటలు పట్టేది. మేకప్ ఆర్టిస్ట్ నిక్కీ ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలేదు. లేడీ గెటప్ విషయంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయ్యేలా ఉండదు. చాలా నేచురల్ గా వచ్చింది.

ట్రైలర్లో ఎక్కువ అడల్ట్ కంటెంట్ కనిపిస్తుంది ?
అడల్ట్ కాదండి. ఇది యూత్ ఫుల్ కంటెంట్. అవుట్ అండ్ అవుట్ ఎంటర్ టైనర్.

ఈ కథ విన్న్నప్పుడు మీ ఇనిషియల్ ఇంప్రెషన్ ఏంటి ?
-కథ చెప్పినంత సేపు విపరీతంగా ఎంజాయ్ చేశాను. ఇలాంటి నవ్వులు జనాలకి ఎందుకు ఇవ్వకూదని అనిపించింది. ఇప్పటివరకు చేసిన సినిమాలన్నీ చాలా సీరియస్ గానే వింటాను. కానీ ఈ కథ విన్నప్పుడు మాత్రం చాలా ఎంజాయ్ చేశాను.

మీరు కాంపౌండ్ కామెంట్ విషయంలో ఇచ్చిన సమాధానం గురించి చిరంజీవి గారు ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో ప్రస్తావించడం ఎలా అనిపించింది?
-నాకు చాలా ముచ్చటేసింది, నేను అక్కడితో అది ఎండ్ అయిపోయింది అనుకున్నాను. కానీ నా ఉద్దేశాన్ని చిరంజీవి గారు కూడా ప్రస్తావించడం చాలా ఆనందంగా అనిపించింది. అందరం అందర్నీ సపోర్ట్ చేసుకోవాలి. అంతిమంగా మనం మంచి సినిమాల్ని ఆడియన్స్ ఇవ్వాలి. సినిమా మీద ప్రేమతోనే అందరం ప్రయాణిస్తున్నాం.

నెక్స్ట్ ప్రాజెక్ట్స్ గురించి ?
ఈ మంత్ ఎండ్ నటులని పరిచయం చేస్తున్నాం. ఫంకీ మూవీ ఇమ్మిడియట్ గా స్టార్ట్ చేస్తున్నాం.