NTV Telugu Site icon

Vishwak Sen: విశ్వక్ పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్ కి లక్షల్లో నెల జీతం, ఫ్లాట్!

Vishwaksen

Vishwaksen

సాధారణంగా బాలీవుడ్ లో హీరోలు ఎక్కువగా తమకు సెక్యూరిటీ ఆఫీసర్లను నియమించుకుంటూ ఉంటారు. కానీ తెలుగు హీరో విశ్వక్సేన్ తో కలిసి కనిపిస్తున్న ఆయన సెక్యూరిటీ ఆఫీసర్ గత కొంతకాలంగా టాలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశం అవుతున్నాడు. విశ్వక్సేన్ దగ్గర హర్యానాకు చెందిన ఎక్స్ సర్వీస్మెన్ రోతాష్ చౌదరి పనిచేస్తున్నాడు. అతని ఎత్తు ఏడడుగులు. సాధారణంగా బ్లాక్ డ్రెస్ లో కనిపించే అతన్ని చూసి అందరూ కమాండో అనుకుంటూ ఉంటారు.

Tollywood: 1000 కోట్ల సినిమాకి..ప్రొడ్యూసర్ కు వచ్చేదెంత?

గతంలో దేశానికి సర్వీస్ అందించిన ఆయన ఇప్పుడు రిటైర్మెంట్ తర్వాత విశ్వక్సేన్ దగ్గర పని చేస్తున్నారు. గతంలో సల్మాన్ ఖాన్ దగ్గర ఆయన సెక్యూరిటీగా పనిచేసిన అనుభవంతో విశ్వక్సేన్ ఆయన్ని తన సెక్యూరిటీ ఆఫీసర్గా నియమించుకున్నాడు. అయితే ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే నెలకు విశ్వక్సేన అతనికి రెండు లక్షల జీతం చెల్లిస్తున్నాడు. అంతేకాక ఒక ఫ్లాట్ కూడా ఇచ్చి వాళ్ళ పిల్లల్ని కూడా చదివిస్తున్నాడట. ఒకరకంగా మన కుర్ర హీరోలు వ్యక్తిగత భద్రత కోసం ఇంత ప్రాముఖ్యత ఇస్తున్నారు అనే చర్చ టాలీవుడ్ వర్గాల్లో జరుగుతోంది.