NTV Telugu Site icon

విశ్వక్ సేన్ మాస్ మూవీకి సీక్వెల్

Vishwak Sen

Vishwak Sen

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ప్రస్తుతం ‘పాగల్’ చిత్రంతో బిజీగా ఉన్నాడు. సరికొత్త లవ్ స్టోరీతో ఫ్రెష్ లుక్ లో లవర్ బాయ్ గా ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి రెడీ అవుతున్నాడు విశ్వక్. ఏప్రిల్ 30న విడుదల కావాల్సిన ఈ చిత్రం కరోనా కారణంగా వాయిదా పడింది. అసలు విషయంలోకి వస్తే… ఇప్పుడు విశ్వక్ సేన్ గతంలో నటించిన ఓ మాస్ మూవీకి సీక్వెల్ తెరకెక్కబోతోంది. ఈ విషయాన్నీ స్వయంగా విశ్వక్ ప్రకటించాడు. ప్రశంసలు పొందిన మలయాళ యాక్షన్ డ్రామా ‘అంగమలీ డైరీస్’ అధికారిక తెలుగు రీమేక్ “ఫలక్నుమా దాస్‌”. ఈ చిత్రంతో యువ హీరో విశ్వక్ సేన్ దర్శకుడు, నిర్మాతగా మారారు. అంతేకాదు ఈ చిత్రంతోనే విశ్వక్ కు మంచి క్రేజ్ వచ్చింది. అయితే తాజాగా ఈ రోజు విశ్వక్ ఇన్‌స్టాగ్రామ్‌లో “ఫలక్నుమా దాస్” ముహూర్తం వేడుక నుండి త్రోబాక్ చిత్రాన్ని పంచుకున్నారు. “3 సంవత్సరాల క్రితం, ఫలక్నుమాదాస్ ముహూర్తం షాట్. నిన్నటిలా అనిపిస్తుంది ”అని విశ్వక్ తన పోస్ట్‌లో రాశాడు. ఇక ఈ పోస్టులోనే “ఫలక్నుమా దాస్ 2” కోసం ఈ చిత్ర బృందం త్వరలో మళ్లీ కలుస్తుందని చెప్పారు. ఆసక్తికరం విషయం ఏమంటే… ‘అంగమలీ డైరీస్’ కు సీక్వెల్ లేదు. మరి విశ్వక్ “ఫలక్నుమా దాస్ 2” కథను ఎలా ముందుకు తీసుకెళ్తాడో చూడాలి.

View this post on Instagram

A post shared by Vishwak Sen (@vishwaksens)