మెగాస్టార్ చిరంజీవి హీరోగా, త్రిష హీరోయిన్‌గా తెరకెక్కుతోన్న ప్రతిష్టాత్మక ఫాంటసీ ఎంటర్‌టైనర్ ‘విశ్వంభర’ పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. 2023 దసరా సందర్భంగా విడుదలైన గ్లింప్స్‌కు మిక్స్‌డ్ స్పందన రాగా, కొన్ని ట్రోల్స్ కూడా వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈసారి, అదే గ్లింప్స్‌ను టార్గెట్ చేసిన ట్రోల్స్‌కి గట్టి సమాధానం ఇవ్వబోతున్నాడట దర్శకుడు వశిష్ఠ.
Also Read : Mukesh Chhabra : సీత గా నటించే హక్కు సాయిపల్లవికి మాత్రమే ఉంది..
తాజా ఇంటర్వ్యూలో వశిష్ఠ మాట్లాడుతూ.. “గతంలో ట్రోల్స్ ఎలా వచ్చాయో తెలుసు. కానీ ఈసారి ట్రైలర్ చూస్తే ట్రోల్స్ చేసిన వాళ్లే మెచ్చుకుంటారు. విశ్వంభర ట్రైలర్ అన్ని అంచనాలకు న్యాయం చేస్తుంది. సినిమా ఫీల్, గ్రాండియర్, కాన్సెప్ట్ అన్నీ కలిపి చూపించబోతున్నాం’’ అని కాన్ఫిడెంట్‌గా చెప్పారు. ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. అయితే మొదటి నుంచి కూడా విశ్వంభర.. ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ తరహాలో ఉంటుందని వార్తలు వచ్చాయి. దీంతో వశిష్ఠ ఈ వార్త పై కూడా స్పందించారు.. ‘మనకు మొత్తం 14 లోకాలు ఉంటాయి. కింద 7 ఉండగా.. పైన 7 ఉంటాయి. స్వర్గం, పాతాళం, యమలోకం.. ఇలా వీటన్నింటికీ మెయిన్ లోకం సత్యలోకం.. అదే బ్రహ్మ లోకం. ఇప్పటివరకు చాలామంది డైరెక్టర్స్ తమకు నచ్చిన పద్ధతిలో నచ్చిన లోకాన్ని చూపించారు. కానీ నేను ఇప్పుడు సత్యలోకానికి చూపించబోతున్నాను. విశ్వం మొత్తాన్ని భరించేదే విశ్వంభర. అక్కడ ఉన్న హీరోయిన్ కోసం హీరో 14 లోకాలు దాటి వెళ్తాడు. ఆ సత్యలోకం నుంచి హీరోయిన్‌ను హీరో ఎలా కిందకు తీసుకొచ్చాడు అనేది కథ’ అని చెప్పుకొచ్చాడు. ప్రజంట్ ఈ వార్త కూడా వైరల్ అవుతుంది.
