NTV Telugu Site icon

‘విశాల్ 31’ షూటింగ్ స్పాట్ లో ఆ నటితో విశాల్ సెల్ఫీ…!

Vishal Selfie with Raveena Ravi on Shooting Spot od Vishal31

తమిళంతో పాటు తెలుగులో మంచి క్రేజ్ ను సంపాదించుకున్న హీరో విశాల్. నూతన దర్శకుడు శరవణన్ దర్శకుడిగా ‘విశాల్ 31’ చిత్రం రూపొందుతోంది. విశాల్ సరసన ఈ చిత్రంలో డింపుల్ హయాతి హీరోయిన్ గా నటిస్తోంది. యువ నటి, డబ్బింగ్ ఆర్టిస్ట్ రవీనా రవి ఈ సోసియో-థ్రిల్లర్ లో కీలకపాత్రలో నటిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో విడుదల ఏకకాలంలో విడుదల కానున్న ఈ సినిమాకి యువన్‌ శంకర్‌ రాజా సంగీతం అందిస్తున్నారు. తాజాగా ఈ సినిమా సెట్లో రవీనా రవితో విశాల్ తీసుకున్న సెల్ఫీని తాజాగా పోస్ట్ చేశారు మేకర్స్. ప్రస్తుతం ఈ పిక్ వైరల్ అవుతోంది. మరోవైపు ఆనంద్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఎనిమీ’లో ఆర్యతో కలిసి నటిస్తున్నారు విశాల్‌. ఎస్ వినోద్ కుమార్ నిర్మించిన ఈ చిత్రంలో మమతా మోహన్‌దాస్, ప్రకాష్ రాజ్, మృణాలిని రవి కూడా నటించారు. తమన్ సంగీతం అందిస్తున్నారు. పై అంచనాలు పెరిగిపోయాయి. ఇప్పటికే ఆర్య ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేశారు.