Site icon NTV Telugu

Vishal : వెడ్డింగ్ డేట్‌పై క్లారిటీ ఇచ్చిన విశాల్..

Vishal & Sai Dhanshika

Vishal & Sai Dhanshika

కోలివుడ్ చిత్ర పరిశ్రమలో మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్స్ లిస్ట్ లో హీరో విశాల్ కూడా ఒకరు. దాదాపు 20 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్న విశాల్.. ఇంకా పెళ్లి చేసుకోకపోవడం ఆయన అభిమానులను బాధిస్తోంది. పలువురు హీరోయిన్లతో ఆయనకు ఎఫైర్స్ ఉన్నాయని.. త్వరలోనే ఫలానా హీరోయిన్‌తో విశాల్ పెళ్లి జరగబోతోందని గతంలో ఎన్నో వార్తలు పుట్టుకోచ్చాయి. వరలక్ష్మీ శరత్ కుమార్, అభినయ, లక్ష్మీమీనన్, అనీషా రెడ్డి, రీమాసేన్ తదితర హీరోయిన్లతో విశాల్ ప్రేమాయణం సాగించారని సోషల్ మీడియాలో గాసిప్స్ వచ్చాయి. వీటికి స్వయంగా విశాల్ పలుమార్లు చెక్ పెట్టేశారు. అయిన కూడా అవి ఆగలేదు దీంతో.. అవన్నీ గాలి వార్తలేనని ధన్సిక ద్యారా క్లారిటి ఇచ్చారు విశాల్.

Also Read : Priyanka Chopra : ప్రియాంక చోప్రా బర్త్‌డే‌కు.. ఊహించని షాక్ ఇచ్చిన భర్త.. !

తమిళ నటి సాయి ధన్సికను పెళ్లి చేసుకోబోతున్నట్టు ఇటీవల ప్రకటించారు. చాలా కాలంగా రిలేషన్‌షిప్‌లో ఉన్న వీరిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకుంటారన్న వార్తలు సినీ వర్గాల్లో హల్‌చల్ చేశాయి. కానీ తాజాగా ఈ పెళ్లి వాయిదా పడినట్టు వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. దీంతో అభిమానుల్లో చిన్న నిరాశ ఏర్పడింది. ఇటీవల ఒక ఈవెంట్‌లో విశాల్ మాట్లాడుతూ, “ నడిగర్ సంఘం భవనం కోసం 9 ఏళ్లు పెళ్లి చేసుకోలేదు.. ఇక భవన నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి.. నడిగర్ భవనంలో తొలి పెళ్లి నాదే, ఇప్పటికే బుకింగ్ కూడా చేసుకున్నా. ఆగస్ట్ 29న ఓ గుడ్ న్యూస్ చెబుతాను’ అని ఆయన తెలిపారు. అంటే దీని బట్టి విశాల్ ఆగస్ట్ 29న తన పెళ్లికి కొత్త ముహూర్తం ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.

Exit mobile version