NTV Telugu Site icon

Virat Kohli : జూనియర్ ఎన్టీఆర్ నాకు మంచి స్నేహితుడు

Kohli

Kohli

Virat Kohli : ఇండియన్ క్రికెటర్స్ అంటే ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.సినిమా హీరో కంటే కూడా భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది.అయితే క్రికెటర్స్ ,సినిమా హీరోల మధ్య మంచి బాండింగ్ ఉంటుంది.అది కూడా బాలీవుడ్ హీరోలతో మరింత ఎక్కువగా ఉంటుంది.సినీ సెలెబ్రెటీల పార్టీలకు ,ఫంక్షన్స్ కు క్రికెటర్స్ హాజరవుతూ వుంటారు.అలాగే ఐపీఎల్,వరల్డ్ కప్ వంటి ఆరంభ వేడుకలలో,అలాగే ముగింపు వేడుకలలో సినీ సెలెబ్రెటీస్ పాల్గొని ఎంతో సందడి చేస్తుంటారు.దీనికి ముంబై వాణిజ్య రాజధాని కావడం కూడా మరో కారణం అని చెప్పొచ్చు.ఎందుకంటే ముంబైతో క్రికెటర్ల అసోసియేషన్ ఎక్కువగా ఉంటుంది.దాంతో బాలీవుడ్ స్టార్స్ తో క్రికెటర్స్ కు మంచి బాండింగ్ ఏర్పడింది.అయితే మిగతా భాషల హీరోలతో క్రికెటర్లు ఎవ్వరూ అంతగా క్లోజ్ అవ్వరు.

Read Also : Balakrishana : “అఖండ 2” పై క్రేజ్ రూమర్ వైరల్..?

అయితే ఈ మధ్య కాలంలో తెలుగు హీరోల సినిమాలు ప్రపంచవ్యాప్తంగా అద్భుత విజయం సాధిస్తుండటంతో క్రికెటర్స్ తెలుగు హీరోలతో కూడా మంచి బాండింగ్ ఏర్పరుచుకుంటున్నారు. తాజాగా మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ గురించి టీం ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఆసక్తికర విషయాలు తెలియజేసాడు.తెలుగు సినిమా హీరోల్లో జూనియర్ ఎన్టీఆర్ నాకు మంచి స్నేహితుడు అని విరాట్ తెలిపారు.ఎన్టీఆర్ యాక్టింగ్ అంటే ఎంతో ఇష్టమని విరాట్ తెలిపారు.అయితే నేను కొన్నాళ్ల క్రితం ఎన్టీఆర్ తో ఒక యాడ్ లో నటించాను.ఆ సమయంలో అతని వ్యక్తిత్వం ,అతను మాట్లాడే తీరు నాకు ఎంతగానో నచ్చిందని కోహ్లీ తెలిపారు.అలాగే ‘ఆర్ఆర్ఆర్’ లో ఎన్టీఆర్ నటన అద్భుతంగా ఉంటుంది.నా భార్య అనుష్కతో కలిసి ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు డాన్స్ కూడా చేసినట్లు విరాట్ తెలిపారు. గత సంవత్సరం నేను ఓ మ్యాచ్ ఆడుతున్న సమయంలో నాటు నాటు పాటకు ఆస్కార్ రావడంతో గ్రౌండ్ లోనే నాటు నాటు స్టెప్ వేసి ఎంతో సంతోషించాను అని విరాట్ తెలిపారు.