NTV Telugu Site icon

6 రోజుల్లో రూ. 11 కోట్లు… అనుష్క, విరాట్ విరాళాల సేకరణ…!

Virat and Anushka raised Rs.11 Crore funds for corona patients

దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభణ నేపథ్యంలో కరోనా పేషెంట్స్ కు సహాయం చేయడానికి ఇండియా క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ, అతని భార్య అనుష్క శర్మ నిధుల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. వారికి అభిమానుల నుండి భారీ స్పందన వస్తోంది. మొదటి రోజు రూ.3.6 కోట్ల విరాళాలు అందగా, ఆరు రోజుల్లో ఈ సంఖ్య 11,39,11,820 రూపాయలకు చేరుకోవడం విశేషం. ఈ విషయాన్ని ట్విట్టర్ లో విరాట్ తెలిపారు. “మా లక్ష్యాన్ని ఒక్కసారి కాదు, రెండుసార్లు అధిగమించామని మేము భావిస్తున్నాము. ఈ విషయం చెప్పడానికి మాకు మాటలు సరిపోవట్లేదు. విరాళం ఇచ్చిన, షేర్ చేసిన, ఏదో ఒక విధంగా హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. మనం ఇందులో కలిసే ఉన్నాము. మనం దీనిని కలిసే అధిగమిస్తాము” అంటూ విరాట్ ట్వీట్ చేశారు.