NTV Telugu Site icon

Lamp: రాకేష్ మాస్టర్ చివరి సినిమాకి టికెట్ రేట్ల తగ్గింపు!

Vinod Rakesh Lamp

Vinod Rakesh Lamp

వినోద్‌, మధుప్రియ, కోటి కిరణ్‌, అవంతిక ప్రధాన పాత్రల్లో నటించిన ‘ల్యాంప్‌’ సినిమాకి రాజశేఖర్‌ రాజ్‌ దర్శకుడు. ఈ నెల 14న విడుదల కానున్న ఈ సినిమా గురించి లీడ్ రోల్ పోషించిన వినోద్ మీడియాతో ముచ్చటించాడు. మా లాంప్ సినిమా ఒక క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్.వరుస హత్యలు జరుగుతున్న నేపథ్యంలో వాటిని ఛేదించే క్రమంలో హీరో ఎలా ట్రావెల్ అయ్యాడు ? అనేదాన్ని కామెడీగా దీన్ని చూపిస్తూ ఫైనల్ గా అసలు ఏం జరిగింది? ఎలా వాటిని ఆపాడు అనేది స్టోరీ అని అన్నారు. ఈ సినిమాలో నేను ఒక కానిస్టేబుల్ గా ఉండి ఆ కేసులను పట్టుకొని ఫైనల్ గా ఇన్స్పెక్టర్ అవడం జరుగుతుంది, సస్పెన్స్ మెయింటైన్ చేస్తూనే కామెడీ పండించడం నా పాత్ర హైలెట్ అని అన్నారు. రాకేష్ మాస్టర్ నటించిన చివరి సినిమా ఇదేనన్న వినోద్ నాతో పాటు హీరోయిన్ మధుప్రియ, కోటి కిరణ్, అవంతిక, వెంకీ, నాగేంద్ర, చలపతి, సౌమ్య, నాగరాజు నటించారన్నారు.

Vikram : విక్రమ్ సినిమా తెలుగు స్టేట్స్ మంచి ధర పలికింది

ప్రస్తుతం నేను చేసిన బార్బరీక్ అనే సినిమా రిలీజ్ రెడీగా ఉంది . అలాగే శాసనమా చట్టమా అనే సినిమాలో హీరో సుమన్ కొడుకు క్యారెక్టర్ చేస్తున్నా, మెయిన్ లీడ్ అలాగే డైరెక్టర్ హర్ష, డైరెక్టర్ తల్లాడ సాయి కృష్ణ చేస్తున్న రెండు సినిమాల్లో లీడ్ గా నటిస్తూ ఉన్నానని అన్నారు. అందరికీ అందుబాటులో ఉండాలన్న ఉద్దేశంతో మా సినిమా టికెట్ రేట్ ని 110 రూపాయలుగా నిర్ణయించారు, కాబట్టి అందరూ వచ్చి మా సినిమా చూడండి డెఫినెట్గా మీరు పెట్టిన 110 రూపాయలకి రెండు వందల పది రూపాయల ఎంటర్టైన్మెంట్ మేము అందిస్తామని గ్యారెంటీ ఇస్తున్నామని అన్నారు. తప్పకుండా దీంట్లో కామెడీ ఉంటుంది, రొమాన్స్ ఉంటుంది. మంచి సాంగ్స్ ఉన్నాయి, ఫైట్స్ ఉన్నాయి. మీరు అద్భుతంగా ఎంజాయ్ చేస్తారు మంచి సస్పెన్స్ థ్రిల్లర్ మా సినిమా అని వినోద్ అన్నారు.