Site icon NTV Telugu

Telugu Film Journalists: తెలుగు సినీ పాత్రికేయ చరిత్రను ఆవిష్కరించిన కృష్ణ, బ్రహ్మానందం

Krishna Bramhanandam

Krishna Bramhanandam

vinayaka rao book about telugu film journalists first look released: తెలుగు సినీ పాత్రికేయ చరిత్రను కృష్ణ, బ్రహ్మానందం ఆవిష్కరించారు. తెలుగు సినిమా పుట్టిన ఆరేళ్ల కు తొలి తెలుగు సినిమా పత్రిక తెలుగు టాకీ వచ్చింది. ఇక అప్పటి నుంచి తెలుగులో ఎన్ని పత్రికలు వచ్చాయి, ఏ ఏ జర్నలిస్టు చిత్ర పరిశ్రమ అభివృద్ధికి కృషి చేశారనే వివరాల గురించి మూడేళ్లు కృషి చేసి సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ వినాయకరావు అందిస్తున్న పుస్తకం తెలుగు సినీ పాత్రికేయ చరిత్ర. ఈ పుస్తకం ఫస్ట్ లుక్ పోస్టర్ ను సూపర్ స్టార్ కృష్ణ, స్టార్ కమెడియన్ బ్రహ్మానందం విడివిడి గా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా హీరో కృష్ణ మాట్లాడుతూ ‘వినాయకరావు ఇంతవరకూ ఎన్టీఆర్, దాసరి, రామానాయుడు గురించి పుస్తకాలు రాశారు. నా సినీ జీవిత విశేషాలు, నటించిన చిత్రాల వివరాలతో దేవుడు లాంటి మనిషి పుస్తకం విడుదల చేశారు.

500 పేజీలతో వెలువడిన ఆ పుస్తకం అందరినీ అలరించింది. ఇప్పుడు సినీ పాత్రికేయుల చరిత్రకు అక్షర రూపం ఇస్తున్నారు. అయన ప్రయత్నం విజయవంతమై, మంచి పేరు తెచ్చి పెట్టాలని ఆశిస్తున్నాను’ అన్నారు. బ్రహ్మానందం మాట్లాడుతూ ’84 ఏళ్ల సుదీర్ఘమైన పాత్రికేయ చరిత్రని అక్షరాల్లో పెట్టాలని అనుకోవడం సాహసమే. కానీ ఎంతో మంది జీవిత చరిత్రలు రాసిన వినాయకరావుకి ఇది సాధ్యమే. ఈ పుస్తకం ఆయనకు మరింత పేరు తెచ్చి పెట్టాలని ఆశిస్తున్నాను’ అన్నారు. వినాయకరావు మాట్లాడుతూ ‘పాత్రికేయుల చరిత్రను పుస్తక రూపంలో తీసుకు రావాలన్నది నా 15 ఏళ్ల కల. ఇప్పటికీ అది కార్య రూపం దాలుస్తోంది. పుస్తకం రెడీ అయింది. వచ్చే నెలలో విడుదల చేస్తాం’ అని తెలిపారు.
Swathi Muthyam Trailer Out: ‘స్వాతి ముత్యం’ ట్రైలర్ విడుదల

Exit mobile version