‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్’ స్టార్ విన్ డీజిల్ మంచి జోష్ లో ఉన్నాడు. ఆయన నటించిన ‘ఎఫ్ 9’ మూవీ అమెరికాలోనూ, బయట కూడా భారీగా వసూళ్లు సాధించింది. అయితే, తన తాజా సీక్వెల్ సక్సెస్ తో ఆనందంలో ఉన్న విన్ డీజిల్ కి హఠాత్ విషాదం ఎదురైంది. ఆయన ప్రాణ మిత్రుడు డొమినికన్ లెజెండ్రీ మ్యుజీషియన్ జానీ వెంచ్యూరా గుండెపోటుతో గురువారం నాడు చనిపోయాడు. ఆయన వయస్సు 81 సంవత్సరాలు. సంగీత ప్రపంచంలో జానీకి ప్రత్యేక స్థానం ఉంది. పైగా డీజిల్ కి ఆయన సుదీర్ఘ కాలంగా ఆప్త మిత్రుడు. అందుకే, జానీ వెంచ్యూరా హఠాన్మరణం యాక్షన్ హీరోని ఎంతగానో క్రుంగదీసింది. ఇన్ స్టాగ్రామ్ లో తన కన్నీటి సందేశాన్ని ఫ్యాన్స్ పంచుకున్నాడు విన్…
Read Also : “ఎస్ఆర్ కళ్యాణమండపం” సెన్సార్ పూర్తి
జానీ వెంచ్యూరాతో తాను ఉన్న ఒక వీడియోని సొషల్ మీడియా ప్లాట్ పామ్ లో షేర్ చేసిన విన్ డీజిల్ “నిజమైన లెజెండ్… హంబుల్ మ్యాన్… ఆయనలోని వెలుగు ప్రపంచాన్ని మెరిపించింది” అన్నాడు. అంతే కాదు, స్వర్గస్తుడైన మిత్రుడికి సంతాపం తెలియజేస్తూ “నీ ఆత్మకి శాంతి కలగాలి. నువ్వు మా అందరి మీద ఎంతో ప్రభావం చూపావు మిత్రమా!” అన్నాడు. లెజెండ్రీ మ్యూజిక్ డైరెక్టర్ జానీ వెంచ్యూరాకి సొషల్ మీడియాలో వీడ్కోలు సందేశాలు వెల్లువెత్తుతున్నాయి. ఆయన మరణాన్ని తట్టుకోలేని చాలా మంది విన్ డీజిల్ పోస్టుకు స్పందనగా ‘రెస్ట్ ఇన్ పీస్’ కామెంట్స్ చేస్తున్నారు. వెంచ్యూరా లేని లోటు తీర్చలేనిదని వాపోతున్నారు…
