TVK VIJAY : తమిళనాడు సీఎంగా విజయ్?.. జననాయగన్ రిలీజ్ కు లైన్ క్లియర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త అధ్యాయం మొదలైంది. 2026 అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో దళపతి విజయ్ తన ‘తమిళగ వెట్రి కళగం’ (TVK) పార్టీతో ప్రభంజనం సృష్టించారు. అంచనాలను తలకిందులు చేస్తూ TVK మెజారిటీ స్థానాలను కైవసం చేసుకోగా, అధికార DMK గట్టి ఎదురుదెబ్బ తింది. విజయ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం దాదాపు ఖాయం కావడంతో అటు రాజకీయంగానే కాకుండా సినీ ఇండస్ట్రీలో కూడా సంచలనం రేకెత్తించింది.
విజయ్ రాజకీయాల్లోకి వస్తూ నటించిన చివరి చిత్రం ‘జననాయగన్‘. ఈ సినిమా రిలీజ్ గత కొన్ని నెలలుగా సందిగ్ధంలో పడిన సంగతి తెలిసిందే. సెన్సార్ సర్టిఫికేట్ పేరుతో సాంకేతిక కారణాలతో పలుమార్లు వాయిదా వేస్తూ వచ్చారు. అయితే ఇప్పుడు విజయ్ ఎన్నికల్లో ఘనవిజయం సాధించడంతో ఈ పొలిటికల్ థ్రిల్లర్ విడుదలకు ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయాయి. మే 8న ఈ సినిమా థియేటర్లలోకి వచ్చేందుకు సిద్ధమవుతోంది. ‘జననాయగన్’ చిత్రం విడుదలకు ముందే ఆన్‌లైన్‌లో లీక్ అయినప్పటికీ విజయ్ క్రేజ్ మరియు తాజా రాజకీయ విజయం సినిమాపై అంచనాలను ఆకాశానికి చేర్చాయి. ప్రపంచ సినీ చరిత్రలోనే లీక్ అయిన ఒక సినిమా ‘ఇండస్ట్రీ హిట్’గా నిలవడం ఇదే మొదటిసారి అయ్యే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. విజయ్ కొత్త ముఖ్యమంత్రిగా ఎన్నిక కాబోతున్న నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం సినిమాల ప్రదర్శన సమయాలపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అభిమానుల కోరిక మేరకు రాష్ట్రవ్యాప్తంగా అర్లీ మార్నింగ్ షోలకు అనుమతినిస్తూ కొత్త ‘జీవో’ వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం ట్రేడ్ సర్కిల్స్‌లో ‘జననాయగన్’ హాట్ ప్రాపర్టీగా మారింది. మొదటి రోజే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద హిస్టరీ క్రియేటింగ్ ఓపెనింగ్స్ రాబట్టడం ఖాయమని అంచనా వేస్తున్నారు విజయ్ ఫ్యాన్స్.
Also Read
- Shah Rukh Khan: వన్ ఇయర్లో రూ.2,490 కోట్ల లాస్.. అయినా ఆయనే కింగ్!
- Mandadi : 100 కోట్ల క్లబ్లో సుహాస్-సూరిల ‘మండాడి’.. ప్రత్యేకంగా అభినందించిన కమల్
- Faria: నేనింకా ఇల్లు కొనలేదు.. సందీప్ కిషన్ చెప్పాక కొనాలనుకున్నా.!
- Hanuman Ansh : రూ. 400 కోట్ల దిశగా హనుమాన్ అంశ్ 47వ రోజు దాదాపు రూ. 5 కోట్లు వసూళ్లు
తాజావార్తలు
-
SBI Debit Card: మీ దగ్గర SBI ఏటీఎం కార్డు ఉందా.. వాడకపోతే ఎంత ఛార్జీ పడుతుందో తెలుసా..
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Shah Rukh Khan: వన్ ఇయర్లో రూ.2,490 కోట్ల లాస్.. అయినా ఆయనే కింగ్!
-
Massive Cloud: భారత్ నుంచి చైనా వరకు భారీ మేఘాలు.. వెలుగులోకి ఉపగ్రహ చిత్రాలు
-
AP High Court: స్థానిక ఎన్నికల పిటిషన్లపై విచారణ పూర్తి.. తీర్పును రిజర్వ్ చేసిన ఏపీ హైకోర్టు
ట్రెండింగ్
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్‌ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!
-
150+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో Xiaomi Watch S5, Smart Band 11 లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే.!