Site icon NTV Telugu

‘ఆర్ఆర్ఆర్’ ఫైట్ సీన్లలో ఎమోషన్ ను ఫీల్ అవుతారు : విజయేంద్ర ప్రసాద్

Vijayendra Prasad about Emotional Fighting Scenes in RRR

ప్రస్తుతం తెలుగు ప్రేక్షకులతో పాటు భారతదేశం మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా ఏదైనా ఉందంటే అది రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఆర్ఆర్’ సినిమా. ఎన్టీఆర్ రామ్ చరణ్ హీరోలుగా అలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా మీద ప్రకటించిన నాటి నుండి భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఈ సినిమాకి సంబంధించి రోజుకో ఒక ప్రచారం జరుగుతూనే ఉంది. అయితే తాజాగా ఈ సినిమాకు కథ స్క్రీన్ ప్లే అందిస్తున్న విజయేంద్రప్రసాద్ కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించారు. అయితే తాజా ఇంటర్వ్యూలో విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమాలో ఫైట్ సీన్స్ చూసి తాను కన్నీళ్లు పెట్టుకున్నాను అని చెప్పుకొచ్చాడు. సాధారణంగా ఎక్కడైనా ఫైట్ సీన్స్ చూస్తే ఈలలు వేస్తారు… కానీ ఈ ఫైట్ సీన్స్ చూస్తే మాత్రం కళ్ళవెంట నీళ్ళు తిరగడం ఖాయం అని చెప్పుకొచ్చారు. థియేటర్లకు వచ్చిన ఆడియన్స్ కూడా ఆ ఎమోషన్స్ కి కనెక్ట్ అవుతారని, ఇది చెబితే అర్థం కాదు ఖచ్చితంగా చూసి తీరాల్సిందే అని ఆయన చెప్పుకొచ్చారు. ఈ సినిమా గురించి ఎంత గొప్పగా మాట్లాడుకున్నా అది ఇంకా తక్కువే అవుతుందని ఆయన అన్నారు. అజయ్ దేవగన్, సముద్రకని లాంటి పలు భాషలకు చెందిన నటులు కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాని డివివి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ మీద డి.వి.వి.దానయ్య నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ సినిమా విషయంలో ఎక్కడ దర్శకనిర్మాతలు వెనకాడటం లేదు.

Exit mobile version