Site icon NTV Telugu

Family Star Twitter Review: కొండన్న హిట్ కొట్టాడా?.. సినిమా ఎలా ఉందంటే?

Family Star (2)

Family Star (2)

విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన లేటెస్ట్ మూవీ ఫ్యామిలీ స్టార్.. డైరెక్టర్ పరుశురాం తెరకేక్కించిన ఈ సినిమాకు దిల్ రాజు నిర్మాతగా వ్యవహారించారు.. ఈ సినిమా ఈరోజు గ్రాండ్ గా విడుదలైంది.. మొదటి నుంచి సినిమాకు మంచి టాక్ ఇప్పుడు కూడా అదే టాక్ ను అందుకున్నట్లు తెలుస్తుంది.. ఈ సినిమాతో విజయ్ హిట్ కొట్టాడా.. జనాలు ఏం చెబుతున్నారో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం..

సినిమా ఫస్ట్ ఆఫ్ కన్నా సెకండ్ ఆఫ్ బాగుందా ని ఓ యూజర్ ట్వీట్ చేశారు.. ఫస్ట్ హాఫ్ ఎంజాయ్ చేయవచ్చట. అందులో స్ట్రాంగ్ కమర్షియల్ వైబ్స్ ఉన్నాయని చెప్పాడు. అయితే, సెకండాఫ్ ఫస్టాఫ్ కంటే బావుందట. ఫ్యామిలి ఎమోషన్స్ బాగున్నాయి.. ఆడియన్స్ సెకండ్ ఆఫ్ కు బాగా కనెక్ట్ అవుతారు. ఇక అలాగే విజయ్ దేవరకొండ, మృణాల్ అద్భుతంగా నటించారు.. సినిమాకు రేటింగ్ 4/5 ఇచ్చారు..

ఫ్యామిలీ స్టార్ సినిమా చాలా బాగుంది.. నేను బాగా ఎంజాయ్ చేశాను.. ఎక్కువ ఎక్స్పెక్ట్ చెయ్యవద్దని, జస్ట్ ఎంటర్టైన్ అవ్వమని సలహా ఇచ్చాడు. ఇంకా విజయ్ దేవరకొండ పెర్ఫార్మన్స్ కొత్తగా ఉంది. ఏం క్రీమ్స్ వాడుతున్నాడో గానీ స్కిన్ సూపర్ ఉంది.. మృణాల్ ఠాకూర్ ఎప్పటిలాగే సూపర్ గా చేసింది. అంటూ ఓ యూజర్ రాసుకొచ్చారు..

https://twitter.com/Kittigadu_16/status/1776019546782003316?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1776019546782003316%7Ctwgr%5Eca1357ae23bf908433d8c353bd5881e935238d32%7Ctwcon%5Es1_c10&ref_url=http%3A%2F%2Fapi-news.dailyhunt.in%2F

ఫ్యామిలీ బొమ్మ, మాస్ & కమర్షియల్ మైండ్ సెట్ తో థియేటర్లకు వెళ్లకుండా ఫ్రెండ్స్, గర్ల్ ఫ్రెండ్స్, ఫ్యామిలీతో వెళ్లండి. ఎంజాయ్ చేయండి.. విజయ్, మృణాల్ పెర్ఫార్మన్స్ చాలా బాగుంది.. సినిమా బొమ్మ సూపర్ హిట్ అంటూ మరో యూజర్ రాసుకొచ్చారు..

ట్విట్టర్ టాక్ పాజిటివ్ గానే ఉంది. మరి సినిమా ఇప్పటివరకు అయితే పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది.. రేటింగ్ విషయానికొస్తే.. 4/5 అందుకుంది.. ఇక కలెక్షన్స్ ఎలా ఉంటాయో తెలియాలంటే కాస్త వెయిట్ చెయ్యాల్సిందే.. మొత్తానికి విజయ్ ఖాతాలో మరో బ్లాక్ బాస్టర్ పడినట్లే అని ఫ్యాన్స్ అంటున్నారు..

Exit mobile version