Site icon NTV Telugu

Vijay Sethupati : డ్రగ్స్, కాస్టింగ్ కౌచ్ ఆరోపణలపై విజయ్ సేతుపతి సీరియస్‌!

Vijay Sethupathi

Vijay Sethupathi

తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి ప్రస్తుతం వివాదంలో చిక్కుకున్నారు. బ్రిటిష్ సైకియాట్రిస్ట్ డాక్టర్ రమ్య మోహన్ ఆయనపై డ్రగ్స్, కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేస్తూ సోషల్ మీడియాలో బాంబు పేల్చారు. సేతుపతి కొంత మంది మహిళలతో ‘కారవాన్ ఫేవర్’ కోసం డీల్ చేస్తాడంటూ, ఒక యువతి ప్రస్తుతం రిహాబ్ సెంటర్‌లో ఉందని పేర్కొన్నారు. కొన్ని గంటల్లోనే ఆమె ఈ పోస్టులను డిలీట్ చేసినప్పటికీ, అప్పటికే వైరల్ అయ్యాయి.

Also Read : OG : ఓజీ మొదటి పాటకు కౌంట్‌డౌన్ షురూ.. డేట్ ఇదేనా ?

ఈ నేపథ్యంలో విజయ్ సేతుపతి స్పందిస్తూ, ‘ఈ ఆరోపణల్లో కాస్త కూడా నిజం లేదు. ఇప్పటికే నా టీమ్ సైబర్ క్రైమ్ శాఖలో ఫిర్యాదు చేసింది. నన్ను దగ్గర నుంచి చూసినవాళ్లకు ఈ ఆరోపణలు న‌వ్వు పుట్టించేలా ఉన్నాయి. అలాంటివి నాకు బాధ కలిగించవు, కానీ నా కుటుంబం, స్నేహితులు కలత చెందారు. ఆమె ప్రజా దృష్టిలోకి రావాలనే ఉద్దేశంతో ఇదంతా చేస్తుంది. ఈ రకమైన తప్పుడు ప్రచారాలు నేను గత ఏడేళ్లలో ఎన్నో చూశాను. అవి నా ప్రొఫెషనల్ లైఫ్ మీద ఎలాంటి ప్రభావం చూపలేవు. నాకు తెలుసు నిజం ఎప్పటికీ నిలబడుతుంది’ అని స్ట్రాంగ్‌గా చెప్పారు విజ‌య్.

Exit mobile version