Site icon NTV Telugu

మే 14న ఓటిటిలో విజయ్ సేతుపతి మూవీ

Vijay Sethupathi Premieres May 14 on Aha

విజయ్ చందర్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి, రాశి ఖన్నా, నివేదా పెతురాజ్ ప్రధాన పాత్రల్లో నటించిన తమిళ చిత్రం ‘సంగతమీజన్ ’. ఈ మాస్ ఎంటర్టైనర్ గతేడాది నవంబర్ 15న తెలుగులో ‘విజయ్ సేతుపతి’ టైటిల్ తో విడుదలైంది. వివేక్ మెర్విన్ సంగీతం అందించిన ఈ సినిమా తెలుగు రైట్స్ ను హర్షిత మూవీస్ బ్యానర్ అధినేత రావూరి వి శ్రీనివాస్ సొంతం చేసుకున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి విడుదలైన ‘విజయ్ సేతుపతి’ చిత్రం తాజాగా తెలుగు ఓటిటి వేదికపై విడుదలకు సిద్ధంగా ఉంది. ఆహాలో మే 14న ‘విజయ్ సేతుపతి’ ప్రీమియర్ కానుంది. ఈ విషయాన్ని తెలుపుతూ తాజాగా ‘విజయ్ సేతుపతి’ మూవీ పోస్టర్ ను విడుదల చేశారు. ప్రస్తుతం విజయ్ సేతుపతికి టాలీవుడ్ లో మామూలు క్రేజ్ లేదు. ఇటీవల ‘ఉప్పెన’ చిత్రంలో విలన్ గా నటించి విమర్శకుల ప్రశంసలు పొందారు విజయ్ సేతుపతి. ఓ వైపు హీరోగా సినిమాలు చేస్తూనే… మరోవైపు క్రేజీ విలన్ గా సత్తా చాటుతున్నాడు విజయ్ సేతుపతి.

Exit mobile version