విజయ్ కుమార్ మనవరాలు వెండితెరపై మెరువబోతోందా!?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సీనియర్ నటుడు విజయ్ కుమార్ వివిధ భాషల్లో 400లకు పైగా చిత్రాలలో నటించారు. అంతే కాదు ఆయన పిల్లలంతా సినిమాల్లో యాక్ట్ చేశారు. విజయ్ కుమార్ మొదటి భార్య ముత్తుకన్నుకు ముగ్గురు పిల్లలు. అనిత, కవిత, అరుణ్ విజయ్. అందులో అరుణ్ విజయ్ ఇప్పుడు కోలీవుడ్ లో పాపులర్ ఆర్టిస్ట్ గా పేరు తెచ్చుకున్నాడు. ఇక విజయ్ కుమార్ రెండో భార్య నటి మంజుల గురించి అందరికీ తెలిసిందే. దక్షిణాది చిత్రాలలో గ్లామర్ క్వీన్ గా పేరు తెచ్చుకుంది మంజుల. ఆమెకు వనిత, ప్రీతి, శ్రీదేవి ముగ్గురు కూతుళ్ళు. విశేషం ఏమంటే ఈ ముగ్గురూ కూడా తెలుగు సినిమాల్లో కథానాయికలుగా నటించారు. విజయ కుమార్ పిల్లల్లో అసలు సినిమాల్లో నటించని వ్యక్తి ఒక్కరే ఒకరు. ఆమె అనిత. డాక్టర్ గోకుల్ కృష్ణన్ ను వివాహం చేసుకున్న అనితకు ఇద్దరు పిల్లలు. ఒక అబ్బాయి, ఒక అమ్మాయి. ప్రస్తుతం అనిత కుమార్తె దియా లండన్ లో వైద్య విద్యను అభ్యసిస్తోంది. సినిమాల్లో ఉన్న తండ్రితోనూ, తమ్ముడితోనూ చక్కని అనుబంధం ఉన్న అనిత తన కుమార్తెను నటిని చేసే అవకాశం లేకపోలేదని కోలీవుడ్ మీడియా అంటోంది. మరి డాక్టర్ చదువుతున్న దియా మనసులో ఏముందో తెలియదు. ఏదేమైనా మనవరాలికి సినిమా రంగం పట్ల ఆసక్తి ఉంటే విజయ్ కుమార్ తప్పకుండా స్వాగతిస్తాడని, అలానే మేనమామ అరుణ్ సహకారమూ దియాకు ఉంటుందని అంటున్నారు. ఈ మెడికో… నటిగా మారుతుందో లేదో చూడాలి!
Also Read
- Jailer 2: ‘జైలర్ 2’ నుంచి ఫస్ట్ ప్రోమో రిలీజ్.. సూరజ్ వెంజరమూడుకు అదిరిపోయే క్యారెక్టర్!
- Shruti Haasan: మగవాళ్లకు కూడా పీరియడ్స్ రావాలి.. వాళ్లకు ఆ బాధ తెలియాలి : శ్రుతి హాసన్ కామెంట్స్ వైరల్!
- Sigma Trailer: సందీప్ కిషన్ ‘సిగ్మా’ ట్రైలర్ వచ్చేసింది.. రూ.500 కోట్ల రాకెట్‌తో హీరో ఫైట్!
- Picnic: ప్రేమలు మేకర్స్ నుంచి మరో ఫ్యామిలీ ఎంటర్టైనర్.. సంక్రాంతికి ‘పిక్నిక్’!
తాజావార్తలు
-
Ajit Agarkar: చీఫ్ సెలెక్టర్ పదవికి అజిత్ అగార్కర్ గుడ్‌బై? బీసీసీఐలో హాట్ టాపిక్
-
Lava Bold N4 Pro 5G: లావా Bold N4 Pro 5G లాంచ్.. Android 16, 6,000mAh బ్యాటరీ, 5Gతో కొత్త ఫోన్
-
Jailer 2: ‘జైలర్ 2’ నుంచి ఫస్ట్ ప్రోమో రిలీజ్.. సూరజ్ వెంజరమూడుకు అదిరిపోయే క్యారెక్టర్!
-
iPhone Langar: ఐఫోన్ కొనలేకపోతున్నారా..? ఉచితంగా పొందే అవకాశం మిస్ కావొద్దు..!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
ట్రెండింగ్
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!