Jana Nayagan: ఎన్నికల ఆఫీసులో పైరసీ సినిమా.. ఇంతకీ ఆ సినిమా ఏంటో తెలుసా? చూస్తే షాక్ అవుతారు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jana Nayagan: బాధ్యతాయుతమైన ఎన్నికల విధుల్లో ఉండి, పైరసీని ప్రోత్సహించిన ఓ వ్యక్తి ఉదంతం ఇప్పుడు తమిళనాడులో కలకలం రేపుతోంది. దళపతి విజయ్ నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘జననాయగన్’ (Jana Nayagan) లీకైన వెర్షన్‌ను ఎన్నికల నిఘా కేంద్రంలోనే వీక్షించినందుకు గానూ ఒకరిని పోలీసులు అరెస్ట్ చేశారు. అసలేం జరిగిందంటే..
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో చెన్నైలోని అన్నా యూనివర్శిటీలో ఎన్నికల నిఘా కోసం ఒక కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశారు. ఈ కేంద్రానికి కాంట్రాక్ట్ ప్రాతిపదికన యువరాజ్ అనే వ్యక్తిని సీసీటీవీ హెడ్‌గా నియమించారు. కీలకమైన సెక్యూరిటీ బాధ్యతల్లో ఉన్న యువరాజ్, తన విధులను పక్కనపెట్టి ఇంకా సెన్సార్ బోర్డు దగ్గరే ఉన్న విజయ్ సినిమా ‘జననాయగన్’ లీకైన క్లిప్పింగ్‌లను వీక్షించాడు. మనోడు ఈ సినిమాను చూడటమే కాకుండా ఏకంగా తాను ‘జననాయగన్’ చూస్తున్నట్లుగా కొన్ని ఫోటోలు, వీడియోలు తీసి తన ఫేస్బుక్ ఖాతాలో పోస్ట్ చేశాడు. అంతకుముందే తాను ఎన్నికల విభాగంలో కీలక బాధ్యతల్లో ఉన్నట్లు తన ఐడీ కార్డును కూడా సోషల్ మీడియాలో షేర్ చేశాడు.
Also Read
ఈ పోస్టులు కాస్తా వైరల్ కావడంతో ఉన్నతాధికారులు వెంటనే అలర్ట్ అయ్యారు. ఎన్నికల విధుల్లో తీవ్ర నిర్లక్ష్యం వహించడమే కాకుండా, పైరసీని ప్రోత్సహించినందుకు పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు విజయ్ కెరీర్లో చివరి చిత్రంగా భావిస్తున్న ‘జననాయగన్’ మే 8న విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే ఈ సినిమా క్లిప్పింగ్‌లు లీక్ అవ్వడంపై చిత్ర పరిశ్రమ తీవ్రంగా స్పందించింది. సినిమా లీక్ బాధ్యుడిని చేస్తూ ‘సదరన్ ఇండియా ఫిల్మ్ ఎడిటర్స్ అసోసియేషన్’ (SIFEA), సినిమా ఎడిటర్ ప్రదీప్ ఇ.రాఘవ్‌పై కొన్నాళ్ల పాటు సస్పెన్షన్ విధిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. చూడాలి మరి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న రిలీజ్ డేట్‌కే సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందో రాదో అనేది. ఇప్పటి వరకు సినిమా రిలీజ్ విషయంలో మేకర్స్ ఎలాంటి అధికారిక ప్రకటనను విడుదల చేయలేదు.
తాజావార్తలు
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..
-
Trump vs Zelenskyy: జెలెన్స్కీపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.. ఉక్రెయిన్ కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలంటూ సూచన!
-
PM Modi Chennai Visit Today: నేడు చెన్నైలో ప్రధాని మోడీ పర్యటన.. రూ.13,000 కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం!
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!