NTV Telugu Site icon

Vijay : విజయ్ పార్టీకి చిరు ప్రజారాజ్యానికి ఉన్న సంబంధం ఏంటో తెలుసా..?

Untitled Design (13)

Untitled Design (13)

తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి రాజయాకియల్లోకి రాబోతున్న సంగతి తెలిసిన విషయమే. విజయ్ రాకతో తమిళనాట ‘తమిళగ వెట్రి కళగం’ అనే కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భవించింది. అవినీతి నిర్మూళనే లక్ష్యంగా విజయ్ పొలిటికల్ జర్నీ సాగనున్నట్టు అయన సన్నిహిత వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం విజయ్ నటిస్తున్న రెండు సినిమాలను పూర్తి చేసి త్వరలోనే పూర్తి స్థాయి రాజకీయాల్లోకి రాబోతున్నాడు విజయ్. ఆ విధంగా కెరీర్ ప్లాన్ చేసాడు ఇళయదళపతి.

Also Read: OTT Release : ఈ వారం ఓటీటీలో రచ్చ చేయనున్న సినిమాలు ఏవో తెలుసా..?

కాగా నేడు ‘తమిళగ వెట్రి కళగం’ పార్టీ యొక్క జెండా మరియు గుర్తును చెన్నైలో ప్రకటించాడు విజయ్. జెండా లో పైన కింద ఎరుపు రంగు, మధ్యలో పసుపు రంగు, దాని మధ్యలో ఓ పువ్వు దానికి అటు ఇటు రెండు ఏనుగులు కాలుపైకెత్తి రంకే వేస్తూండేలా జెండా ను రూపొందించారు. అలాగే విక్టరీ సింబల్ గా రెండు చేతులతో థంబ్స్ అప్ సింబల్ చూపిస్తూ తన పార్టీసింబల్ ను చూపించాడు విజయ్. ఈ సింబల్ మన టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ సింబల్ లా ఉందని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. అది కూడా చిరు బర్త్ డే నాడు ప్రకటించడం యాదృచ్చికమే అయిన రెండిటిని సరిపోలుస్తున్నారు. తమిళ రాజయాకియలలో సినీనటులు పార్టీలు పెట్టడం కొత్తేమి కాదు, MGR, కెప్టెన్ విజయ్ కాంత్, శరత్ కుమార్, శివాజీ గణేశన్, భాగ్యరాజ్, టి రాజేందర్, కమల్ హాసన్ ఇలాఎంతో మంది ప్రారంభించి తర్వాత ఇతర పార్టీలలో కలిపేశారు. 2029 ఎన్నికలే లక్ష్యంగా విజయ్ పార్టీని రెడీ చేయబోతున్నాడు. మరి తమిళనాడు రాజకీయాలలో విజయ్ ఏ మాత్రం తన సత్తా చాటుతాడో చూడాలి