టాలీవుడ్ రౌడి హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న తాజా చిత్రం ‘కింగ్‌డమ్’. ‘జెర్సీ’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మిస్తున్న ఈ మూవీలో భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటించింది. కాగా ఈ నెల 31న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ప్రచారంలో భాగంగా ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ నుండి అద్భుతమైన స్పందన లభించగా తాజాగా ఈ మూవీ నుంచి ఒక సెంటిమెంట్ సాంగ్ విడుదల చేశారు..
Also Read : War 2: వార్ 2 నుంచి కొత్త పోస్టర్ రిలీజ్.. ఎన్టీఆర్ లుక్ అదుర్స్
‘అన్నా అంటేనే..’ అనే ఈ రెండో గీతాన్నీకిని కృష్ణకాంత్ సాహిత్యాన్ని అందించగా, విజయ్ దేవరకొండ, సత్యదేవ్ సోదరులుగా నటించారు. హృదయాలను హత్తుకుంటూ భావోద్వేగాలను నింపే పదాలతో పాట సాగింది. ఇద్దరి యాక్టింగ్ కూడా పాటలో చాలా ఎమోషనల్ లు క్రియేట్ చేసింది. ఈ పాట విజయ్ దేవరకొండ-సత్యదేవ్‌ల పాత్రల అనుబంధాన్ని హృదయానికి హత్తుకునేలా చూపించడమే కాకుండా, అన్నదమ్ముల అనుబంధానికి ఒక భావప్రధమైన అంకురార్పణ గా నిలిచింది. మొత్తానకి ఈ సారి మంచి సెంటిమెంట్ తో విజచ్ ప్రేక్షకులను అలరించబోతున్నట్లుగా తెలుస్తోంది.
