Site icon NTV Telugu

సరికొత్త బాడీ ట్రాన్సఫార్మేషన్ లుక్ లో రౌడీ హీరో…!

Vijay Deverakonda massive body transformation Look Goes Viral

రౌడీ హీరో విజయ్ దేవరకొండ బాడీ ట్రాన్సఫార్మేషన్ లుక్ ఒకటి నెట్టింట్లో తుఫాన్ సృష్టిస్తోంది. “లైగర్” చిత్రం కోసం పూర్తిగా సరికొత్త మేకోవర్ లోకి మారిన విజయ్ దేవరకొండకు లుక్ కు ఆయన అభిమానులు ఫిదా అవుతున్నారు. తాజాగా ప్రముఖ ఫోటోగ్రాఫర్ డబ్బూ రత్నాని క్లిక్ చేసిన తాజా ఫోటోలో విజయ్ దేవరకొండ భారీగా కండలు తిరిగిన దేహంతో అద్భుతంగా కనిపిస్తున్నాడు. డబ్బూ రత్నాని క్యాలెండర్ లాంచ్ 2021 కోసం క్లిక్ చేసిన తాజా పిక్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ పిక్ ను షేర్ చేసిన క్షణాల్లోనే వైరల్ అయ్యింది. ఈ ఫోటోకు “నేను మీ కోసం సిద్ధంగా ఉన్నాను” అంటూ క్యాప్షన్ ఇచ్చాడు ఈ సెన్సేషనల్ హీరో.

Read Also : బీచ్ లో ఎంజాయ్ చేస్తున్న “లైగర్” బ్యూటీ…!!

కాగా ప్రస్తుతం విజయ్ దేవరకొండ “లైగర్” అనే పాన్ ఇండియా చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తోంది. డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ బాక్సర్ గా కనిపించనున్నాడు. దానికోసం ప్రత్యేకంగా బాక్సింగ్ లో శిక్షణ కూడాతీసుకున్నాడు ఈ యంగ్ హీరో. ఈ చిత్రం అప్డేట్ గురించి విజయ్ అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

View this post on Instagram

A post shared by Vijay Deverakonda (@thedeverakonda)

Exit mobile version