Vijay Deverakonda Changes his DP with Kalki 2898 AD Arjuna Photos: టాలీవుడ్‌లో పెద్దగా సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకున్నా ఎప్పుడో నువ్విలా సినిమా నుంచి ప్రయత్నాలు చేస్తూ ఎట్టకేలకు పెళ్లి చూపులు సినిమాతో హీరోగా మారి హిట్ అందుకున్నాడు. అయితే ఆ తరువాత అర్జున్ రెడ్డి, టాక్సీవాలా లాంటి సినిమాలతో కెరీర్ ఆరంభంలో వరుస హిట్లతో దూసుకొచ్చిన విజయ్ దేవరకొండ ఎందుకో ట్రోలింగ్, విపరీతమైన హేట్ ఫేస్ చేస్తున్నాడు. ‘కల్కి 2898AD’ మూవీలో విజయ్ దేవరకొండ, అర్జునుడి పాత్రలో నటించాడు. Kalki 2898AD మూవీలో అర్జునుడి పాత్రలో విజయ్ దేవరకొండ గెటప్, డైలాగ్ డెలివరీ విషయంలో సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది.
Sivaji: ఎట్టకేలకు సూపర్ ఛాన్స్ పట్టేసిన శివాజీ
అర్జునుడి పాత్రలో అల్లు అర్జున్ మొదలు రామ్ చరణ్ వరకు ఫలానా హీరో నటించి ఉంటే బాగుండేదని, దేవరకొండకు ఏమాత్రం సెట్ కాలేదని ఒక వర్గం కావాలని చేసి వదులుతున్న మీమ్స్ వైరల్ అవుతున్నాయి. విజయ్, అర్జునుడిలా డైలాగ్స్ చెప్పమంటే అర్జున్ రెడ్డిలా చెప్పాడని ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు.. నిజానికి అర్జునుడి పాత్రలో విజయ్ దేవరకొండ చక్కగా నటించాడు కానీ విజయ్ దేవరకొండ మీసాల విషయంలో కొంచెం కేర్ తీసుకుని ఉండాల్సింది. ఏదేమైనా ఉన్నంతలో విజయ్ దేవరకొండ తనకిచ్చిన పాత్రలో అదరకొట్టాడు. కానీ విజయ్ ను టార్గెట్ చేసి మరీ ట్రోల్ చేస్తున్నట్టే అనిపిస్తోంది. ఎందుకంటే సౌత్‌లో ట్రోలింగ్స్ జరుగుతున్నాయి కానీ నార్త్‌లో మాత్రం విజయ్ దేవరకొండ ఎంట్రీ విజిల్స్ పడుతున్నాయి.
Just watched the film.
I don’t know what to say..
Overwhelmed
Indian cinema new level unlocked
Wth was that!
I hope it makes a 1000 crores and more.. ❤️#Kalki2898AD— Vijay Deverakonda (@TheDeverakonda) June 29, 2024
విజయ్‌ని ఇలాంటి పాత్రలో చూసి ఉత్తరాది ఫ్యాన్స్ ఆనందపడుతున్నారు కూడా. తెలుగులో మాత్రం విజయ్ దేవరకొండపై నెగటివిటీ బయటపడుతూనే ఉంది. నిజానికి విజయ్ దేవరకొండకి కాస్త యాటిట్యూడ్ అన్నట్టు అతని ప్రవర్తన ఉంటుంది. బహుశా అది ఆయన సహజ స్వభావమే అయి ఉండొచ్చు అయితే అదే విజయ్ కి ఈ రేంజ్‌లో హేటర్స్ రావడానికి ఇది కూడా ఓ కారణం కావచ్చు. అయితే ఎంత మంది హేట్ చేస్తున్నా, ఎన్ని ట్రోల్స్ వస్తున్నా విజయ్ మాత్రం ఎక్కడా తగ్గడం లేదు. ఈ ట్రోల్స్‌కు సరైన సమాధానం ఇచ్చేలా విజయ్ తన ఇన్‍స్టాగ్రామ్, ఎక్స్ (ట్విట్టర్) అకౌంట్లకు డీపీ (డిస్‍ప్లే పిక్చర్)ని నేడు మార్చుకున్నారు. కల్కిలో తాను పోషించిన అర్జునుడి పాత్ర ఫొటోను ప్రొఫైల్ ఫొటోగా సెట్ చేసిన విజయ్ తనను ట్రోల్ చేసే ట్రోలర్లకు గట్టిగానే బదులిచ్చాడు విజయ్.