ఆల్ ఇండియా “టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ మెన్ లిస్ట్ లో సెకండ్ ప్లేస్ లో విజయ్ దేవరకొండ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ స్టార్స్ ను మించిన క్రేజ్, స్టార్ క్రికెటర్లను మించిన ఫాలోయింగ్ సంపాదించుకున్నారు విజయ్ దేవరకొండ. ఈ టాలీవుడ్ స్టార్ రిసెంట్ గా హైదరాబాద్ “టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ మెన్” గా టాప్ ప్లేస్ సంపాదించుకోగా.. ఇప్పుడు టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ మెన్ 50″ లో నేషనల్ వైడ్ గా రెండో స్థానం దక్కించు కున్నారు. పోయిన సంవత్సరం మూడో ప్లేస్ లో ఉన్న విజయ్ ఇప్పుడు ఏకంగా రెండో స్థానానికి చేరుకున్నాడు. రణవీర్ సింగ్, వికీ కౌషల్, రణ్ బీర్ కపూర్ లాంటి బాలీవుడ్ స్టార్స్ అంతా విజయ్ వెనకే ఉండిపోయారు.
ఆన్ లైన్ ఓటింగ్, జ్యూరీ అభిప్రాయాల ఆధారంగా వివిధ రంగాల్లోని సెలబ్రిటీలను టాప్ 50 మోస్ట్ డిజైరబుల్ మెన్ లిస్ట్ తయారు చేసింది టైమ్స్ గ్రూప్. నేషనల్ వైడ్ గా జరిగిన ఆన్ లైన్ ఓటింగ్ లో దివంగత బాలీవుడ్ స్టార్ సుశాంత్ సింగ్ రాజ్ పుత్ తొలి స్థానం దక్కించుకోగా… రెండో స్థానంలో విజయ్ దేవరకొండ నిలిచారు. ఆదిత్య రాయ్ కపూర్, వికీ కౌశల్, దుల్కర్ సల్మాన్ తొలి ఐదు స్థానాల్లో ఉన్నారు.
Also Read
“అర్జున్ రెడ్డి” సినిమా హిందీ రీమేక్ “కబీర్ సింగ్” తో బాలీవుడ్ లో విజయ్ దేవరకొండ బాగా పరిచయం అయ్యారు. ఇప్పుడు ప్యాన్ ఇండియా సినిమా “లైగర్” తో హిందీ పరిశ్రమకు విజయ్ దేవరకొండ మరింత దగ్గరవుతున్నారు. “టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ మెన్ 50” లిస్ట్ లో విజయ్ సెకండ్ ప్లేస్ గెల్చుకోవడానికి తన ప్యాన్ ఇండియా స్టార్ ఇమేజ్ కూడా దోహదపడింది. దీనితో ఆయన చేస్తున్న తొలి పాన్ ఇండియా సినిమా “లైగర్” మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
తాజావార్తలు
-
Suriya – Mani Ratnam : 8ఏళ్ల క్రితం నాటి కథతో మణిరత్నం దర్శకత్వంలో సూర్య?
-
100+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో VIVO WATCH 6 స్మార్ట్‌వాచ్ లాంచ్.. ఫీచర్స్, ధర ఇవే.!
-
LPG Cylinder Shortage: హోర్ముజ్ సంక్షోభం.. భారత్‌లో ఎల్పీజీ కొరతపై క్లారిటీ ఇచ్చిన కేంద్ర మంత్రి..
-
42 గంటల బ్యాటరీ, అల్ట్రా-లైట్ డిజైన్, AI ఫీచర్లతో VIVO Buds Clip ఓపెన్-ఇయర్ ఇయర్‌ఫోన్స్ లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..!
-
India XI vs World XI: ప్రపంచ దిగ్గజాలంత ఓ వైపు.. టీమిండియా ఒక్కటే మరోవైపు.. ఫ్యాన్స్‌కు కేక పుట్టించే బిగ్ మ్యాచ్!
ట్రెండింగ్
-
50MP Zeiss కెమెరా, 1.5K 144Hz డిస్‌ప్లే, 6,510mAh బ్యాటరీతో ఫ్లాగ్షిప్ మొబైల్ VIVO X500 Pro లాంచ్.!
-
200MP Zeiss టెలిఫొటో కెమెరా, 2K 144Hz డిస్‌ప్లే, 8,000mAh బ్యాటరీతో VIVO X500 Pro Max లాంచ్..!
-
144Hz డిస్‌ప్లే, IP68+IP69 రేటింగ్, 1TB స్టోరేజ్, 90W ఛార్జింగ్‌తో VIVO X500.. ధర, ఫీచర్లు ఇదిగో.!
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!