NTV Telugu Site icon

కరోనా లక్షణాలు, జాగ్రత్తలు చెబుతున్న విజయ్ దేవరకొండ

Vijay Devarakonda Urges People to Stay Safe

దేశంలో కరోనా మహమ్మారి కలకలం సృష్టిస్తోంది. కరోనా వచ్చాక చికిత్స తీసుకోవడం కన్నా ముందుగానే జాగ్రత్త వహించడం మంచిది. తాజాగా సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ కూడా ఇదే చెప్పారు. కరోనాకు సంబంధించిన లక్షణాలు, జాగ్రత్తలు చెబుతూ ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు విజయ్ దేవరకొండ. “కోవిడ్ సెకండ్ వేవ్ ఇండియాను చాలా ఇబ్బంది పెడుతోంది. 2020లో మనం అందరం ఎంతో కష్టపడ్డాం. బయటపడ్డాం అనుకునేలోపే పరిస్థితి ఇంకా ఘోరంగా తయారయ్యింది. లక్షలాది మంది ఇన్ఫెక్ట్ అవుతున్నారు. ఇన్ఫెక్షన్ చాలా వేగంగా వ్యాపిస్తోంది. కానీ మనం అందరం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఈ పరిస్థితి అధిగమించవచ్చు. మనకు ఎలాంటి కోవిడ్ లక్షణాలు కన్పించినా వెంటనే చికిత్స తీసుకుంటే ఏ ఇబ్బందీ ఉండదు. మీకు దగ్గు, జ్వరం, తలనొప్పి, ఒళ్ళు నొప్పులు ఉన్నాయంటే ఖచ్చితంగా కరోనా అయి ఉంటది. వెంటనే డాక్టర్ దగ్గరకు వెళ్లి చికిత్స తీసుకోండి. కరోనా టెస్ట్ చేయించుకుని, రిజల్ట్ వచ్చేదాకా వెయిట్ చేయకుండా… ఏ లక్షణాలు కన్పించినా వెంటనే కరోనా నిబంధనలు పాటిస్తూ చికిత్స తీసుకొని. టైం అన్నిటికంటే ముఖ్యం. ఇక తెలంగాణ ప్రభుత్వం ప్రతీ ఆరోగ్య కేంద్రంలో, ఏరియా హాస్పిటల్స్ లో, బస్తి దవాఖానాల్లో కోవిద్ అవుట్ పేషెంట్ డాక్టర్లను పెట్టారు. మీరు వాళ్ళతో మాట్లాడొచ్చు. మీరు ఏ గవర్నమెంట్ ఆసుపత్రికి వెళ్లినా కొన్ని మందులను ఒక కిట్ రూపంలో ఇస్తారు. వాటిని వాడితే సరిపోతుంది. భయపడకండి. జాగ్రత్తగా ఉండండి” అంటూ ఆ వీడియోలో విజయ్ దేవరకొండ ప్రజలకు కరోనాపై అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు.