Site icon NTV Telugu

Kingdom: ‘విజయ’మ్ అనివార్యమ్!

Kingdom Movie Release Date, Vijay Deverakonda

Kingdom Movie Release Date, Vijay Deverakonda

మొదట్లో సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేస్తూ వచ్చిన విజయ్ దేవరకొండ, ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాతో నటుడిగా కొంత గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత సంవత్సరం చేసిన పెళ్లిచూపులు హీరోగా తనను నిలబెట్టింది. ఆ తర్వాత చేసిన అర్జున్ రెడ్డి, గీతగోవిందం సినిమాలు ఆయనను స్టార్ రేంజ్‌కి తీసుకెళ్లాయి.

Also Read:Tollywood Exclusive: డియర్ ప్రొడ్యూసర్స్.. ఇంకెన్నాళ్లు వేస్తారీ నిందలు!

అయితే ఆ తర్వాత ఆయనకు పెద్దగా సినిమాలు కలిసి రాలేదు. టాక్సీవాలా కొంచెం పర్వాలేదు అనిపించుకున్నా, డియర్ కామ్రేడ్ మొదలు మొన్న వచ్చిన ఫ్యామిలీ స్టార్ వరకు విజయ్ దేవరకొండకు ఏమాత్రం కలిసి రాలేదు. ఒకదాన్ని మించిన డిజాస్టర్‌గా మరొకటి ఆయనను పలకరిస్తూ వచ్చాయి. ఇప్పుడు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో విజయ్ కింగ్‌డమ్ అనే ఒక సినిమా చేస్తున్నాడు. శ్రీలంక నేపథ్యంలో సాగనున్న ఈ సినిమా మీదనే విజయ్ ఆశలన్నీ ఉన్నాయి.

Also Read:HHVM : వీరమల్లును కామెడీ మూవీగా తీయాలనుకున్నాం.. జ్యోతికృష్ణ కామెంట్స్

ఈ సినిమా కచ్చితంగా హిట్ అవుతుందని విజయ్ భావిస్తున్నాడు. అయితే ఈ సినిమా హిట్ కావడం విజయ్‌కి చాలా అవసరం, ఎందుకంటే విజయ్ తదుపరి సినిమాలు ఇప్పటికే లైన్‌లో ఉన్నాయి. కానీ ఆయా నిర్మాణ సంస్థలు సైతం ప్రస్తుతం వరుస ఫ్లాపులలో ఇబ్బంది పడుతున్నాయి. ఇప్పుడు విజయ్‌కి హిట్ పడితేనే అవి సజావుగా సాగే అవకాశం ఉంది. విజయ్ కూడా అందుకే కింగ్‌డమ్ సినిమా పూర్తయ్యే వరకు మిగతా సినిమాలు చేయడానికి శక్తిసమస్తం ఈ సినిమా మీద పెట్టాడు. అయితే ఈ సినిమా విజయ్‌కి ఎంతవరకు కలిసి వస్తుందో, మరి కొద్ది గంటల్లో తేలిపోనుంది. చూడాలి ఏం జరగబోతోంది అని.

Exit mobile version