పాపులర్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ సౌతిండియాలోనే ఓ నయా రికార్డ్ సృష్టించాడు. ఇక్కడ ఏ స్టార్ హీరో క్రాస్ చేయని 12 మిలియన్ ఫాలోవర్స్ ను ఇన్ స్టాగ్రామ్ లో దక్కించుకున్నాడు. చిత్రం ఏమంటే… ఇన్ స్టాగ్రామ్ లో అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ మధ్య అగ్రస్థానం దోబూచులాడుతోంది. ఒకసారి బన్నీది పై చేయి అవుతుంటే మరోసారి విజయ్ దేవరకొండ ది అవుతోంది. తాజాగా విజయ్ దేవరకొండ 12 మిలియన్ ఫాలోవర్స్ ను పొందితే, 11.8 మిలియన్ ఫాలోవర్స్ తో అల్లు అర్జున్ ద్వితీయ స్థానంలో ఉన్నాడు. బహుశా ఒకటి రెండు రోజుల్లో… విజయ్ ను బన్నీ క్రాస్ చేసినా ఆశ్చర్యపోనవసరం లేదు. అలానే ఆ తర్వాత మరి కొద్ది రోజులకి విజయ్ ది పై చేయి అయినా సర్ ప్రైజ్ కానక్కర్లేదు. బాక్సాఫీస్ కలెక్షన్ల మాదిరిగానే సోషల్ మీడియాలోనూ మన స్టార్ హీరోల ఫ్యాన్స్ ఫాలోయింగ్ తో తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు.