హీరో విజయ్ దేవరకొండ బెట్టింగ్ యాప్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణను ఎదుర్కొన్నారు. ఈ కేసులో తన పేరు రావడంతో హైదరాబాద్‌లోని ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరైన విజయ్, తాను ప్రమోట్ చేసిన A23 యాప్‌కు సంబంధించి సమగ్ర సమాచారం అందించి, తన వైఖరిని మీడియాకి స్పష్టం చేశారు. విజయ్ దేవరకొండ ఈడీ విచారణలో బెట్టింగ్ యాప్స్ మరియు గేమింగ్ యాప్స్ మధ్య తేడాను స్పష్టంగా వివరించారు. దేశంలో ఈ రెండు రకాల యాప్స్ వేర్వేరు స్వభావం కలిగి ఉన్నాయని, తాను ప్రమోట్ చేసిన A23 యాప్ ఒక గేమింగ్ యాప్ అని ఆయన తెలిపారు. బెట్టింగ్ యాప్స్‌కు, గేమింగ్ యాప్స్‌కు ఎలాంటి సంబంధం లేదని ఆయన నొక్కి చెప్పారు.
గేమింగ్ యాప్స్ భారతదేశంలోని చాలా రాష్ట్రాల్లో చట్టబద్ధంగా గుర్తింపు పొందాయని, వీటికి GST, టాక్స్, అనుమతులు, రిజిస్ట్రేషన్‌లు వంటి చట్టపరమైన అవసరాలు ఉంటాయని విజయ్ వెల్లడించారు. ఈ గేమింగ్ యాప్స్ IPL, కబడ్డీ, వాలీబాల్ వంటి క్రీడలకు స్పాన్సర్‌షిప్‌లు అందిస్తున్నాయని, ఇది వాటి చట్టబద్ధతను సూచిస్తుందని ఆయన పేర్కొన్నారు. విజయ్ దేవరకొండ తాను ప్రమోట్ చేసిన A23 యాప్ తెలంగాణలో ఓపెన్ కాదని, ఇది కేవలం చట్టబద్ధంగా అనుమతించబడిన రాష్ట్రాల్లోనే పనిచేస్తుందని స్పష్టం చేశారు. A23 ఒక స్కిల్-బేస్డ్ గేమింగ్ ప్లాట్‌ఫామ్‌గా, రమ్మీ వంటి గేమ్‌లను అందిస్తుందని, ఇది సుప్రీంకోర్టు గుర్తింపు పొందిన స్కిల్ ఆధారిత గేమ్‌గా ఉందని ఆయన తెలిపారు. విచారణ సందర్భంగా విజయ్ దేవరకొండ తన బ్యాంక్ లావాదేవీల వివరాలను, A23 యాప్‌తో చేసుకున్న కాంట్రాక్ట్ వివరాలను, లీగల్‌గా తీసుకున్న అమౌంట్‌కు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈడీకి సమర్పించారు. తాను కేవలం చట్టబద్ధమైన గేమింగ్ యాప్స్‌ను మాత్రమే ప్రమోట్ చేశానని, అన్ని లావాదేవీలు పారదర్శకంగా ఉన్నాయని ఆయన చెప్పారు.
