NTV Telugu Site icon

Vijay: త్రిష, రంభలతో విజయ్.. అసలు మ్యాటర్ ఇదా?

Vijay

Vijay

Vijay Bought New Flat in Chennai: తమిళ చిత్రసీమలో రూ.200 కోట్ల రెమ్యునరేషన్‌తో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న నటుడు తలపతి విజయ్. సౌత్ ఇండియన్ ఫిల్మ్ వరల్డ్‌లో చాలా మంది అభిమానులను కలిగి ఉన్న విజయ్, గత కొన్నేళ్లుగా నీలంగరైలో కొత్తగా నిర్మించిన ఇంట్లో నివసిస్తున్నాడు. ప్రస్తుతం విజయ్ భార్య సంగీత అతని నుంచి విడిపోయి లండన్‌లో తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నట్లు సమాచారం. భిన్నాభిప్రాయాలు, విడాకులు.. ఇలా రకరకాల కారణాలు ఇందుకు కారణమని చెబుతున్నా.. కూతురు దివ్య షాషా చదువుల కోసం సంగీత మాత్రం లండన్‌లో ఉంటోందని కూడా మరో ప్రచారం ఉంది. ఇక సీరియస్ పాలిటిక్స్‌లోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్న తలపతి విజయ్.. తన 69వ సినిమా పూర్తి చేసిన తర్వాత సినిమా రంగాన్ని పూర్తిగా వదిలేసి రాజకీయ రంగంలోకి దిగుతానని ఇప్పటికే ప్రకటించారు. ఓ వైపు సన్నాహక పనులు జోరుగా సాగుతున్నాయి. ముఖ్యంగా 2026లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను 234 నియోజకవర్గాల్లో తలపతి విజయ్ ఎదుర్కోబోతున్నారు.

Double Ismart: హనుమాన్ నిర్మాతల చేతికి డబుల్ ఇస్మార్ట్

ఇదిల ఉండగా కాకుండా చెన్నైలోని పట్టినప్పక్కం ప్రాంతంలో విజయ్ కొత్త అపార్ట్‌మెంట్ కొన్నాడనే వార్త వైరల్ అవుతోంది. ఈ సమాచారాన్ని మార్కెట్ విశ్లేషకుడు పిఆర్ సుందర్ తన హోమ్ టూర్ వీడియోలో తెలిపారు. తాజాగా నటుడు విజయ్ రంభతో కలిసి దిగిన ఫోటోలు వైరల్ కాగా.. విజయ్ కొన్న అపార్ట్ మెంట్ లోనే రంభ కూడా ఇల్లు కొన్నట్లు తేలింది. అదే అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్న విజయ్‌ని తన కుటుంబంతో కలిసి సందర్శించి ఆశ్చర్యపరిచింది రంభ. ఇక ఈ అపార్ట్‌మెంట్‌లో ఇల్లు కొన్న ఇతర సెలబ్రిటీల సమాచారం కూడా విడుదలైంది. నటి త్రిష కూడా అదే అపార్ట్‌మెంట్‌లో ఇల్లు కొన్నారు. ప్రముఖ మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ మరియు నటుడు ఆర్య ఇదే అపార్ట్‌మెంట్‌లో తమ సొంత ఫ్లాట్స్ ను కొనుగోలు చేసినట్లు సమాచారం. ఈ ఇంట్లో ఉన్నవన్నీ రిమోట్ కంట్రోల్‌తో పనిచేసేలా డిజైన్ చేయగా, మరుగుదొడ్డి మాత్రమే దాదాపు 7 లక్షల ఉంటుందని పీఆర్ సుందర్ తెలిపారు. అలాగే, ప్రతి ఇంట్లో ప్రయివేట్ థియేటర్, లిఫ్ట్ సౌకర్యం, ప్రైవేట్ స్విమ్మింగ్ పూల్స్‌తో చెన్నైలో రూపొందించిన అపార్ట్‌మెంట్ ఇదొక్కటేనని చెప్పారు.

Show comments