‘బిచ్చగాడు’ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల మనసు గెలుచుకున్న తమిళ స్టార్ విజయ్ ఆంటోనీ. ఆ చిత్రంలో విజయ్ నటనకు సౌత్ ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఈ యంగ్ హీరో విలక్షణమైన కథలను ఎంచుకుంటూ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. ప్రస్తుతం విజయ్ ఆంటోనీ హీరోగా నటిస్తున్న చిత్రం ‘విజయ రాఘవన్’. ఆనంద్ కృష్ణన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం విడుదల తేదీని తాజాగా ప్రకటించారు మేకర్స్. ఈ ఏడాది మే 14న రంజాన్ కానుకగా ‘విజయ రాఘవన్’ థియేటర్లలోకి రానున్నట్లు తెలుపుతూ తాజా పోస్టర్ ను విడుదల చేశారు. ఈ చిత్రంలో విజయ్ సరసన ఆత్మిక హీరోయిన్ గా నటిస్తోంది. రామచంద్రరాజు, ప్రభాకర్ తదితరులు కీలకపాత్రల్లో కనిపించనున్నారు. ఇటీవలే ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. దాదాపు ఐదు భాషల్లో ‘విజయ రాఘవన్’ ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇక ‘బిచ్చగాడు’తో తెలుగులో కూడా మార్కెట్ పెంచుకున్న విజయ్ ఆంటోనీ చిత్రాలు ఇక్కడ కూడా విడుదల అవుతున్నాయి.
రిలీజ్ డేట్ ప్రకటించిన ‘విజయ రాఘవన్’
