NTV Telugu Site icon

Vignesh Shivan : మరో వివాదంలో నయనతార భర్త.. అసలు విషయం ఏంటంటే?

Nayanthara Vignesh Shivan

Nayanthara Vignesh Shivan

నటి నయనతార భర్త విఘ్నేష్ శివన్ పాండిచ్చేరిలో ప్రభుత్వ ఆధీనంలో ఉన్న హోటల్ కావాలని కోరిన వివాదంపై వివరణ ఇచ్చారు. నటి నయనతార భర్త విఘ్నేష్ శివన్ తమిళంలో ఎన్నో హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఆయన తదుపరి చిత్రం లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ టైటిల్‌తో సిద్ధమవుతోంది. ఈ చిత్రంలో ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటిస్తున్నాడు. ఈ చిత్రంలో కృతి శెట్టి, సీమాన్, కెలారి కిషన్ కూడా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. లవ్ ఇన్సూరెన్స్ కంపెనీని సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ మరియు నయనతార రెడ్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అనిరుధ్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. కొన్ని నెలల క్రితం ఈ చిత్రంలోని దీమా దీమా అనే పాట విడుదలై వైరల్‌గా మారింది. వచ్చే సమ్మర్లో ఈ సినిమా విడుదల కానుంది. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది.

Keerthy Suresh: కీర్తి సురేష్ పెళ్లి చీర తయారీకి 405 గంటలు.. ఎందుకో తెలుసా?

కాగా, ఇటీవల పుదుచ్చేరి వెళ్లిన దర్శకుడు విఘ్నేష్ శివన్ అక్కడి రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రితో సమావేశమయ్యారు. అక్కడి ప్రభుత్వ ఆధీనంలో ఉన్న సీగల్ హోటల్ కొనుగోలు చేసేందుకు ప్రయత్నించగా మంత్రి నిరాకరించినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇది చూసిన నెటిజన్లు విఘ్నేష్ శివన్‌పై మీమ్స్ పోస్ట్ చేస్తూ ప్రభుత్వానికి చెందిన బంగ్లా ధర ఎవరైనా అడుగుతారా అంటూ ట్రోల్ చేస్తున్నారు. ఈ సందర్భంగా విఘ్నేష్ శివనే ఈ ఘటనపై వివరణ ఇచ్చారు. నా సినిమా లవ్‌ ఇన్సూరెన్స్‌ షూటింగ్‌కి అనుమతి కోసం పాండిచ్చేరి వెళ్లాను. ఆ తర్వాత పర్యాటక శాఖ మంత్రిని కలిశాను. ఆ సమయంలో నాతో పాటు వచ్చిన వ్యక్తి తనకు అవసరమైన కొన్ని విషయాల గురించి ఆరా తీశారు. దాన్ని తప్పుగా అర్థం చేసుకుని నన్ను విమర్శించి మీమ్స్ పెట్టారు. నేను ఎంజాయ్ చేశాను” అని విక్కీ వివరించారు.

Show comments