Site icon NTV Telugu

ఆ 395 మందిలో ఒక ఒక్క ఇండియా నటి విద్యాబాలన్…!

Vidya Balan and Ekta Kapoor invited to The Academy's Class of 2021

అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ ఈ సంవత్సరం చేరడానికి ఆహ్వానించబడిన 395 మంది ఆర్టిస్ట్స్ అండ్ ఎగ్జిక్యుటివ్స్ జాబితాను ప్రకటించింది. బాలీవుడ్ టాలెంటెడ్ బ్యూటీ విద్యాబాలన్, నిర్మాతలు ఏక్తా కపూర్, శోభా కపూర్ అకాడమీ ‘క్లాస్ ఆఫ్ 2021’ ఆహ్వానితుల జాబితాలో ఉన్నారు. తాజాగా అకాడమీ తమ అధికారిక ట్విట్టర్ లో ఈ విషయాన్నీ వెల్లడించింది. ఇంకా ఆస్కార్ విజేతలు యుహ్-జంగ్ యున్, ఎమరాల్డ్ ఫెన్నెల్, ఫ్లోరియన్ జెల్లర్ ఈ లిస్ట్ లో ఉన్నారు. ఆండ్రా డే, హెన్రీ గోల్డింగ్, వెనెస్సా కిర్బీ, రాబర్ట్ ప్యాటిన్సన్, యాహ్యా అబ్దుల్-మతీన్ II వంటి ప్రముఖులను కూడా ఈ సంవత్సరం ఆహ్వానించారు. అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ ఆస్కార్ నిర్వహిస్తున్న సంస్థ. ఆహ్వానితులు తమ ఆహ్వానాన్ని అంగీకరిస్తే, వారికి ఈ సంవత్సరం ఆస్కార్ అవార్డులో ఓటింగ్ హక్కు ఉంటుంది. ఆహ్వానితుల జాబితాలో నటులు, దర్శకులు, నిర్మాతలు, సినిమాటోగ్రాఫర్లు, సంగీత స్వరకర్తలు, కాస్ట్యూమ్ డిజైనర్లు, రచయితలు, ఫిల్మ్ ఎడిటర్లు, కాస్టింగ్ డైరెక్టర్లు ఉన్నారు.

Read Also : కొత్త పెళ్లి కూతురుకు ఈడీ నోటీసులు..!

ఇక ఆ 395 మందిలో ఒకే ఒక్క ఇండియా నటి విద్యాబాలన్ కావడం విశేషం. 2012 మిస్టరీ థ్రిల్లర్ ‘కహానీ’, 2017 ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘తుమ్హారీ సులు’ వంటి కొన్ని ఐకానిక్ చిత్రాలలో నటనకు గానూ విద్యాను అకాడమీ గుర్తించింది. ‘డ్రీమ్ గర్ల్’, ‘వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ ముంబై’, ‘ఉడ్తా పంజాబ్’, ‘ది డర్టీ పిక్చర్ ‘ వంటి చిత్రాలను నిర్మించిన ప్రొడక్షన్ హౌస్ బాలాజీ టెలిఫిల్మ్స్ నిర్మాతలు ఏక్తా కపూర్, ఆమె తల్లి శోభాలకు కూడా ఇన్విటేషన్ వచ్చింది. గత సంవత్సరం 819 మందిని ఆహ్వానించిన అకాడమీ ఈసారి మాత్రం కరోనా కారణంగా ఆ సంఖ్యను సగానికి తగ్గించి 395 మందిని మాత్రమే ఆహ్వానించింది. 395 మంది ఆహ్వానితులలో 89 మంది మాజీ ఆస్కార్ నామినీలు, 25 మంది విజేతలు ఉండడం విశేషం.

Read Also : భార్యతో కలిసి యష్ గృహ ప్రవేశం… పిక్స్ వైరల్

కాగా గతంలో ఆస్కార్‌లో ఓటు వేయడానికి ఆహ్వానించబడిన భారతీయ ప్రముఖులలో ప్రియాంక చోప్రా జోనాస్, దీపికా పదుకొనే, ఇర్ఫాన్ ఖాన్, అమితాబ్ బచ్చన్, అమీర్ ఖాన్, ఐశ్వర్య రాయ్ బచ్చన్, సల్మాన్ ఖాన్, నిర్మాతలు గౌతమ్ ఘోస్, బుద్ధదేబ్ దాస్‌గుప్తా ఉన్నారు. అకాడమీ 2020 క్లాస్ లో నటులు అలియా భట్, హృతిక్ రోషన్, డాక్యుమెంటరీ చిత్రనిర్మాతలు నిష్ట జైన్, అమిత్ మాధేషియా, డిజైనర్ నీతా లుల్లా, కాస్టింగ్ డైరెక్టర్ నందిని శ్రీకెంట్, విజువల్ ఎఫెక్ట్స్ సూపర్‌వైజర్లు విశాల్ ఆనంద్ సందీప్ కమల్ ఉన్నారు. రాబోయే 94వ అకాడమీ అవార్డులు 2022 మార్చి 27న జరుగుతాయని భావిస్తున్నారు.

Exit mobile version