NTV Telugu Site icon

VidaaMuyarchi : ఫైనల్ షెడ్యూల్ లో ‘విదాముయార్చి’

Vidaamuyarchi

Vidaamuyarchi

తమిళ స్టార్ హీరో అజిత్‌ బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తున్నాడు. ఒకవైపు మైత్రీ మూవీస్ నిర్మిస్తున్న గుడ్ బాడ్ అగ్లీ సినిమా చేస్తూనే మరోవైపు లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ‘విదాముయార్చి’ సినిమా షూట్ లో పాల్గొంటున్నాడు. ఈ రెండు సినిమాల షూట్ జెట్ స్పీడ్ లో జరుతున్నాయి. ఈ రెండిటీలో ‘విదాముయార్చి’ సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు మేకర్స్. మాగిజ్‌ తిరుమేని ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. త్రిష హీరోయిన్ గా నటిస్తుండగా అర్జున్, రెజీనా తదితరులు కీలక పాత్రలు కనిపించనున్నారు. ఇటీవల విడుదల చేసిన ఈ చిత్ర టీజర్‌కు విశేష స్పందన లభించింది.

also read : GameChanger : గేమ్ ఛేంజర్ లో ఆ రెండు బ్లాక్ లు ఫ్యాన్స్ కు పూనకాలే

కాగా ఈ సినిమాకు సంభందించి ఇంట్రెస్టింగ్ ఫొటోస్ ను షేర్ చేసింది నిర్మాణ సంస్థ లైకా. ఈ సినిమా చివరి షూట్ అజిత్ అడుగుపెట్టాడు అని త్రిష, అజిత్ ల ఫోటోలను ఫ్యాన్స్ తో పంచుకున్నారు. అయితే ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అప్పట్లో ఆట ఆరంభం తర్వాత మరోసారి అజిత్, త్రిష జోడి కడుతున్న సినిమా ‘విదాముయార్చి’. జేమ్స్ బాండ్ లుక్ లో అజిత్ కుమార్ లుక్ కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. అజిత్ చేయి పట్టుకుని నడుస్తున్న త్రిష లుక్స్ చూస్తుంటే ఈ సినిమాతో మరోసారి ఈ జోడి ఎదో మ్యాజిక్ చేస్తున్నారు అనే ఫీలింగ్ ఇస్తుందనే చెప్పాలి. ఇటీవల హీరో అజిత్ ఈ సినిమా డబ్బింగ్ కూడా ఫినిష్ చేసాడు. త్వరలో రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేయనున్నారు మేకర్స్.

Show comments