Home
Cinema News
Victory Venkatesh Trivikram Aadarsha Kutumbam Postponed Again October 30is The New Release Date
Aadarsha Kutumbam : ‘ఆదర్శ కుటుంబం’ మళ్లీ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఆదర్శ కుటుంబం’. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ నిర్మిస్తున్న ఈ మోస్ట్ క్రేజీ ప్రాజెక్ట్ కోసం వెంకీ ఫ్యాన్స్ వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమా విడుదల తేదీకి సంబంధించి ఫిల్మ్ నగర్ వర్గాల్లో ఒక ఆసక్తికర వార్త తెగ హల్చల్ చేస్తోంది.
ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఈ చిత్రాన్ని ఈ నెల 9న విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించారు. దీనికి తగ్గట్లే ప్రమోషన్లు కూడా ప్లాన్ చేశారు. కానీ, తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా రిలీజ్ మరోసారి వాయిదా పడినట్లు తెలుస్తోంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఇంకా పూర్తికాకపోవడమే ఈ వాయిదాకు ప్రధాన కారణమని టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా విజువల్ ఎఫెక్ట్స్, రీ-రికార్డింగ్ మరియు ఆడియా వర్క్ అనుకున్న సమయానికి పూర్తి కాలేదని సమాచారం. క్వాలిటీ విషయంలో ఎక్కడా రాజీ పడకూడదనే ఉద్దేశంతోనే దర్శకుడు త్రివిక్రమ్ మరియు నిర్మాణ సంస్థ కొద్దిరోజులు సమయం తీసుకోవాలని భావించినట్లు తెలుస్తోంది. అయితే డిస్ట్రిబ్యూటర్స్ సర్కిల్స్ లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం, ఈ సినిమాను ఈ నెల 30న విడుదల చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. నెలాఖరులో విడుదల చేస్తే పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నీ హడావుడి లేకుండా పూర్తవుతాయని, పైగా సోలో రిలీజ్ అడ్వాంటేజ్ కూడా లభిస్తుందని చిత్ర బృందం భావిస్తున్నట్లు సమాచారం. అయితే, ఈ వాయిదా వార్తలపై మరియు కొత్త రిలీజ్ డేట్‌పై నిర్మాణ సంస్థ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
Also Read
- Srinidhi Shetty: "కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు.." శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
- Sardar 2 OTT: ఓటీటీలో 'సర్దార్ 2' ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
- Vijay - Rashmika: "బీచ్‌లో నిక్కరేసుకుని తాళి కడదామనుకున్నా" .. రౌడీ హీరో విజయ్ వెడ్డింగ్ ప్లాన్‌పై ఇంట్లో సీన్ సితార!
- Manchu Manoj: మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్.. భార్య మౌనిక కోసమే ఆ అడుగు!
తాజావార్తలు
-
Aadarsha Kutumbam : ‘ఆదర్శ కుటుంబం’ మళ్లీ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
-
Tragedy : ట్యాంక్‌బండ్‌పై విషాదం.. పుట్టినరోజు వేడుకల్లో రెండు ప్రాణాలు బలి..
-
Tamil Nadu Bypolls: తమిళనాడు ఉప ఎన్నికల్లో బిగ్ ఫైట్.. విజయ్ వర్సెస్ స్టాలిన్.!
-
Suvendu Adhikari on UCC: UCCపై సువేందు అధికారి కీలక ప్రకటన.. 6 నెలల్లో ‘లవ్ జిహాద్’, ‘ల్యాండ్ జిహాద్’ చట్టాలు!
-
Redmi TV X RGB Mini LED 2027 Launched: రూ.40 వేల లోపే 360Hz గేమింగ్ TV.. 85 ఇంచెస్ Redmi కొత్త Mini LED TV లాంచ్
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!