NTV Telugu Site icon

Vettaiyan : రూ. 300 కోట్ల క్లబ్ లో రజనీకాంత్ ‘వేట్టయన్- ద హంట‌ర్‌’

Rajni

Rajni

సూప‌ర్‌స్టార్ రజినీకాంత్ టైటిల్ పాత్ర‌లో న‌టించిన చిత్రం ‘వేట్టయన్- ద హంట‌ర్‌’. టి.జె.జ్ఞాన‌వేల్ ద‌ర్శ‌క‌త్వం వహించిన ఈ సినిమాను ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడ‌క్ష‌న్స్ నిర్మించింది. సుభాస్క‌ర‌న్ నిర్మాతగా వ్యవహరించారు. ద‌స‌రా సంద‌ర్భంగా అక్టోబ‌ర్ 10న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతోంది. ఏసియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో కలిసి దిల్ రాజు ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేశారు. సీడెడ్ ఏరియాలో శ్రీ లక్ష్మీ మూవీస్ రిలీజ్ చేసింది. గ్లోబల్ గా అన్ని ఏరియాల్లో విజయవంతంగా ప్రదర్శించబడుతూ రిలీజైన కొద్ది రోజుల్లోనే రూ . 300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది ఈ సినిమా. ఇది ఇండియన్ సినిమా చరిత్రలో ఓ మైల్ స్టోన్ అని చెప్పుకోవడమే గాక, లైకా ప్రొడ‌క్ష‌న్స్ కి మంచి బూస్టింగ్ అని చెప్పొచ్చు.

Also Read : Jai Hanuman : చేతులు మారిన ప్రశాంత్ వర్మ ‘జై హనుమాన్’..?

టి.జె.జ్ఞాన‌వేల్ ద‌ర్శ‌క‌త్వంలో వచ్చిన ఈ సినిమాలో పవర్ ఫుల్ యాక్షన్ సీక్వెన్సెస్ ప్రేక్షక లోకాన్ని కట్టిపడేశాయి. ప్రతి షాట్ లో డైరెక్టర్ టేకింగ్ హైలైట్ అయింది. ఈ మూవీలో బాలీవుడ్ స్టార్స్ అమితాబ్ బచ్చన్, మంజు వారియర్, ఫాహిద్ ఫాజల్, రానా దగ్గుబాటి, రితికా సింగ్, దుశారా విజయన్ నటన ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది. ప్రతి యాక్టర్ కూడా తన ఎనర్జిటిక్ పర్ఫార్‌మెన్స్ తో ఆకట్టుకున్నాడు. అనిరుధ్ అందించిన సంగీతం ఈ సినిమా విజయంలో కీలకం అయింది. వెట్టయన్ సినిమా బాక్సాఫీస్ వద్ద ఇప్పటికే రూ. 300 కోట్లను అధిగమించడం, ఇటీవలి కాలంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాలలో ఒకటిగా అవతరించడం విశేషం. అన్ని వయసుల వారు ఈ సినిమాను ఆదర్శిస్తుండటం గమనార్హం.

Show comments