తమిళ సినిమా ఇండస్ట్రీలో మాస్ అండ్ కంటెంట్ కలిపి చూపించగల దర్శకుడు అంటే ముందుగా గుర్తొచ్చే పేరు వెట్రిమారన్. ఆడుకలాం, వడా చెన్నై, అసురన్ వంటి సినిమాలతో ఆయన తన ప్రత్యేకమైన ముద్ర వేశారు. ఇటీవల తన ప్రొడక్షన్ హౌస్ గ్రాస్ రూట్ ఫిల్మ్ కంపెనీను మూసివేస్తున్నట్టు ప్రకటించి అందరిని ఆశ్చర్యానికి గురి చేశారు. కానీ దాంతో తన క్రియేటివ్ జర్నీ ఆగిపోలేదు. ఇప్పుడు ఆయన పూర్తి దృష్టిని తన కొత్త ప్రాజెక్ట్ #STR 49 మీద పెట్టారు.
Also Read : Meenakshi-Chowdary : టాలీవుడ్ నుంచి బాలీవుడ్‌కు అడుగు.. మీనాక్షి చౌదరి కొత్త ప్రయాణం
ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నది శింబు (సిలంబరసన్). ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన స్పెషల్ ప్రోమోను షూట్ చేయగా, అది అక్టోబర్ 4న విడుదల కాబోతోంది. శింబు స్టైల్, వెట్రిమారన్ రియలిస్టిక్ మేకింగ్ ఈ కాంబినేషన్‌పై అభిమానుల్లో ఇప్పటికే పెద్ద ఎక్సైట్మెంట్ ఉంది. ఇక తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో క్రేజీ అప్‌డేట్ బయటకు వచ్చింది. ఈ ప్రాజెక్ట్‌కి సంగీత దర్శకుడిగా అనిరుధ్ రవిచందర్ను తీసుకున్నట్టు సమాచారం. ఇప్పటి వరకు వెట్రిమారన్ ఎక్కువగా జి.వి. ప్రకాష్ కుమార్తోనే పనిచేశారు. ఆడుకలాం నుంచి వడా చెన్నై వరకు ఈ కాంబినేషన్ సూపర్ హిట్ ఆల్బమ్స్ ఇచ్చింది. కానీ ఈసారి కొత్త ఫ్రెష్‌నెస్ కోసం, అలాగే శింబు ఎనర్జీకి తగిన బీట్ కోసం అనిరుధ్‌ను ఎంపిక చేశారని టాక్. మొత్తానికి, వెట్రిమారన్ రియలిస్టిక్ టచ్, శింబు మాస్ పర్ఫార్మెన్స్, అనిరుధ్ ఎనర్జిటిక్ మ్యూజిక్ ఈ కాంబినేషన్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెంచింది. STR49 ఏ స్థాయిలో బ్లాక్‌బస్టర్ అవుతుందో చూడాలి.
