ప్రముఖ కథా రచయిత మృతి… చిరంజీవి దిగ్భ్రాంతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ కథా రచయిత కాళీపట్నం పట్నం రామారావు (కారా మాస్టారు) ఈరోజు కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కారా మాస్టారు శ్రీకాకుళంలోని ఆయన నివాసంలో ఈరోజు ఆయన తుదిశ్వాస విడిచారు. డే అండ్ నైట్ జంక్షన్ సమీపంలోని స్వర్గధామంలో కారా మాస్టారు అంత్యక్రియలు ఈరోజు మధ్యాహ్నం నిర్వహించారు. ఆయన మృతికి పలువురు ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. “తన అద్భుతమైన కథలతో… తెలుగు సాహితీ రంగాన్ని సుసంపన్నం చేసి, తెలుగు కథకు అంతర్జాతీయ గుర్తింపు తెచ్చిన ప్రముఖ రచయత కాళీపట్నం రామారావుగారు మృతి చెందడం తెలుగు సాహితీ రంగంలో పూడ్చ లేని లోటు. కథానిలయం స్థాపించి తెలుగు కథకు ఆయన చేసిన సేవ అజరామరం. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సంతాపం” అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు.
తన అద్భుతమైన కథలతో..తెలుగు సాహితీ రంగాన్ని సుసంపన్నం చేసి, తెలుగు కథకు అంతర్జాతీయ గుర్తింపు తెచ్చిన ప్రముఖ రచయత కాళీపట్నం రామారావుగారు మృతి చెందడం తెలుగు సాహితీ రంగంలో పూడ్చ లేని లోటు. కథానిలయం స్థాపించి
తెలుగు కథకు ఆయన చేసిన సేవ అజరామరం. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సంతాపం. pic.twitter.com/ehOPOrTNeKAlso Read
— Chiranjeevi Konidela (@KChiruTweets) June 4, 2021
కారా మృతికి డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. తెలుగు సాహిత్యానికి విశేషకృషి చేసిన ప్రముఖ కథా రచయిత, కథానిలయం వ్యవస్థాపకులు డాక్టర్ కాళీపట్నం రామారావు చిరస్మరణీయులన్నారు. కథారచనలో ఎందరికో మార్గదర్శిగా నిలిచిన కారా మాస్టారు ఎంతో నిరాడంబరమైన జీవితాన్నిగడిపి, తన జీవితాన్నంతా కథలకు, కథానిలయానికే అంకితం చేశారన్నారు. ఆయన కుటుంబ సభ్యులందరికీ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు కృష్ణదాస్.
తాజావార్తలు
-
Chairman’s Desk : ఎల్‌నినో సంక్షోభం.. ఒత్తిడిలో ప్రపంచం..!
-
Sajjala Ramakrishna Reddy: మీ పాలనపై నమ్మకముంటే ఈ భయమేంటి.. సజ్జల ఘాటు వ్యాఖ్యలు
-
Sai Pallavi: సీత పాత్రతో చాలా నేర్చుకున్నా.. సాయి పల్లవి ఆసక్తికర వ్యాఖ్యలు.!
-
Yash: రావణుడిగా ఎవరైనా చేస్తారు.. రాముడి పాత్ర అంత ఈజీ కాదు: యశ్
-
29kmpl మైలేజ్, 160PS పవర్, పనోరమిక్ సన్‌రూఫ్ తో Renault Duster Hybrid E-Tech లాంచ్..
ట్రెండింగ్
-
Asian Para Games: తొలిరోజే 11 పతకాలు..! ఆసియా పారా గేమ్స్‌లో భారత్‌కు అదిరిపోయే ఆరంభం..
-
India Playing XI: రోహిత్-గిల్ ఓపెనర్స్.. కోహ్లీ మూడో స్థానంలో.! 2027 ప్రపంచ కప్ జట్టును ఎంపిక చేసిన టీమిండియా మాజీ ప్లేయర్.!
-
New Recharge Plans: డేటా అవసరం లేదా? కొత్త రీఛార్జ్ ప్లాన్స్ వచ్చేశాయ్.. రూ.185 నుంచి మొదలు.!
-
WPL 2027 Auction: 27 స్థానాల కోసం 146 మంది ప్లేయర్లు.. WPL వేలం తేదీ, వేదిక ఖరారు..!
-
Manvanth Kumar: సంచలనం.. తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్ వచ్చి సెంచరీ కొట్టిన కర్ణాటక ఆల్‌రౌండర్..!