Mrunal Thakur: ‘యల్లమ్మ’ మూవీలో హీరోయిన్ దొరికినట్టేనా..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘బలగం’ సినిమాతో దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్న కమెడియన్ వేణు, తన తదుపరి చిత్రంగా ‘యల్లమ్మ’ను ప్రకటించి రెండు మూడేళ్లు అవుతున్నా ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. తొలుత ఈ సినిమాలో నేచురల్ స్టార్ నాని నటిస్తాడని ప్రచారం జరిగింది. ఆయన నో చెప్పడంతో నితిన్ పేరు తెరపైకి వచ్చింది. కానీ.. చివరకు అందరినీ ఆశ్చర్యపరుస్తూ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌ను హీరోగా ప్రకటిస్తూ ఒక వీడియోను కూడా విడుదల చేసి షాక్ ఇచ్చారు.
హీరో విషయంలో ఒక స్పష్టత వచ్చినా, హీరోయిన్ ఎంపిక మాత్రం మేకర్స్‌కు పెద్ద సవాలుగా మారింది. మొదట సాయి పల్లవి, ఆ తర్వాత కీర్తి సురేశ్ వంటి స్టార్ హీరోయిన్ల పేర్లు వినిపించినా ఎవరూ ఫైనల్ కాలేదు. తాజాగా ఈ రేసులోకి మృణాల్ ఠాకూర్ పేరు వచ్చి చేరింది. తెలుగులో ఇప్పటికే ‘సీతారామం’, ‘హాయ్ నాన్న’ వంటి సినిమాలతో తన నటనకు మంచి గుర్తింపు తెచ్చుకున్న మృణాల్, గత నెలలో విడుదలైన ‘డెకాయిట్’లోనూ తన పెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకుంది. ప్రస్తుతం మృణాల్ పర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ పాత్రలకే మొగ్గు చూపుతుండటంతో, వేణు రాసుకున్న ‘యల్లమ్మ’ కథకు ఆమె అయితే సరిగ్గా సరిపోతుందని చిత్ర యూనిట్ భావిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుంది, మృణాల్ ఎంపికపై అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుంది అనేది చూడాల్సి ఉంది.
Also Read
తాజావార్తలు
-
165Hz OLED డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
Varanasi : రికార్డ్ ధర పలుకుతున్న వారణాసి తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్.. పోటీలో మైత్రి, దిల్ రాజు, నాగవంశీ
-
AP and Telangana Weather: ఏపీ, తెలంగాణపై ఉపరితల ద్రోణుల ప్రభావం.. పలు ప్రాంతాలకు వర్ష సూచన
-
Sreeleela : శ్రీలీల బాలీవుడ్ తెరంగేట్రానికి ముహుర్తం ఎప్పుడు..?
-
Fake Certificate: గాడిద పేరు మీద నర్సింగ్ సర్టిఫికేట్.. పేరు ‘డంకీ’.. తండ్రి ‘డంకీ ఫాదర్’.. కులం ‘యానిమల్’..
ట్రెండింగ్
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
2K+ 165Hz AMOLED డిస్‌ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!