Venu Swamy Character Played by Raghu Karumanchi in Viraaji: అదేంటి సెలబ్రిటీ ఆస్ట్రాలజర్ సినిమాలలో కూడా నటిస్తున్నాడా? అని ఆశ్చర్య పోవద్దు. ఒకప్పుడు వేణు స్వామి సినిమాలలో చిన్న చిన్న పాత్రలు చేశాడు. అయితే ఇప్పుడు ఆయన నటించలేదు కానీ ఆయనను పోలి ఉన్న ఒక పాత్రను సృష్టించి నవ్వించే ప్రయత్నం చేశాడు. డైరెక్టర్ వరుణ్ సందేశ్ హీరోగా ఆద్యంత్ హర్ష అనే కొత్త దర్శకుడి దర్శకత్వంలో విరాజి అనే సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో సెలబ్రిటీ ఆస్ట్రాలజర్ రామకృష్ణ అనే ఒక పాత్రను సృష్టించారు. రఘు కారుమంచి నటించిన ఈ పాత్ర డిజైన్ చేసిన తీరు చూస్తే కచ్చితంగా అది వేణు స్వామిని ఆధారంగా చేసుకుని డిజైన్ చేసిన పాత్ర అని ఇట్టే అర్థమవుతుంది.
Buddy: అల్లు వారబ్బాయి సినిమాలో ‘జై బాలయ్య’కి సూపర్ రెస్పాన్స్
దీంతో వేణు స్వామి క్రేజ్ కేవలం సోషల్ మీడియా, మీడియాకే పరిమితం కాలేదు. ఏకంగా సినిమాల్లో పాత్రలు సృష్టించే వరకు వెళ్లిందని చెప్పచ్చు. ఈ పాత్ర అనే కాదు ఈ మధ్యకాలంలో వేణు స్వామి మీద కౌంటర్లు వేస్తున్నామనే భావనలో చాలామంది దర్శకులు వేణు స్వామి లాంటి పాత్రలను సృష్టించి వాటి మీద కౌంటర్లు వేయిస్తున్నారు. ఇప్పుడు అదే కోవలో ఈ విరాజి దర్శకుడైతే ఏకంగా ఒక పెద్ద పాత్రను సృష్టించడం గమనార్హం. ఇక ఈ సినిమాకి మంచి టాక్ లభిస్తోంది. నిడివి తక్కువ ఉండడం అయితే కాస్త సినిమాకి కలిసొచ్చిన అంశంలా తోస్తుంది.