NTV Telugu Site icon

నేచుర‌ల్ స్టార్ తో వ‌కీల్ సాబ్ డైరెక్ట‌ర్ మరోసారి!

ప‌రుగెత్తి పాలు తాగ‌డం కంటే నిల‌బ‌డి నీళ్ళు తాగ‌డం బెట‌ర్ అనుకుంటాడు ద‌ర్శ‌కుడు వేణు శ్రీరామ్. అందుకే అత‌ని ఖాతాలో ఇప్ప‌టికి కేవ‌లం మూడు సినిమాలే జ‌మ‌నైనాయి. 2011లో ఓ మై ఫ్రెండ్, 2017లో మిడిల్ క్లాస్ అబ్బాయి త‌ర్వాత మ‌ళ్ళీ ఇంతకాలానికి ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో వ‌కీల్ సాబ్ చేశాడు వేణు శ్రీరామ్. ఈ మూడు సినిమాల‌ను నిర్మించింది దిల్ రాజే కావ‌డం విశేషం. ఇదిలాఉంటే… ఇప్ప‌టికే అల్లు అర్జున్ తో వేణు శ్రీరామ్ ఐకాన్ మూవీ చేసి ఉండాల్సింది. కార‌ణాలు ఏవైనా అది కార్య‌రూపం దాల్చ‌లేదు. తాజాగా ఫిల్మ్ న‌గ‌ర్ లో చ‌క్క‌ర్లు కొడుతున్న స‌మాచారం ఏమంటే… ఇటీవ‌ల నేచుర‌ల్ స్టార్ నానికి వేణు శ్రీరామ్ ఓ స్టోరీ లైన్ చెప్పాడ‌ట‌. అది న‌చ్చ‌డంతో దానిని పూర్తి స్థాయి క‌థ‌గా మ‌ల‌చ‌మ‌ని నాని అన్నాడ‌ట‌. సో… అల్లు అర్జున్ ఐకాన్ సంగ‌తి ఎలా ఉన్నా… వేణు శ్రీరామ్… హీరో నానితో ఓ మూవీని అతి త్వ‌ర‌లోనే చేస్తాడ‌ని అంటున్నారు. ఇప్ప‌టికే ట‌క్ జ‌గ‌దీశ్ మూవీని పూర్తి చేసిన నాని, శ్యామ్ సింగ‌రాయ్ షూటింగ్ లో ప్ర‌స్తుతం పాల్గొంటున్నాడు. దాని త‌ర్వాత అంటే సుంద‌రానికి... మూవీ పూర్తి చేయాల్సి ఉంది. ఆ త‌ర్వాతే వేణు శ్రీరామ్ మూవీ ప‌ట్టాలెక్కుతుంది. విశేషం ఏమంటే… గ‌తంలో నాని, వేణు శ్రీరామ్ తో మిడిల్ క్లాస్ అబ్బాయి మూవీని ప్రొడ్యూస్ చేసిన దిల్ రాజే ఈ సినిమానూ నిర్మిస్తాడ‌ని అంటున్నారు.