Site icon NTV Telugu

Venu : ‘ఎల్లమ్మ’ మూవీ పై అప్డేట్ ఇచ్చిన దర్శకుడు వేణు..

Balagam Venu

Balagam Venu

ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ‘బలగం’ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో చెప్పక్కర్లేదు. చిన్న పెద్ద తేడా లేకుండా పలేటూరు నుంచి బస్సులు కట్టుకొని వచ్చి మరి ఈ మూవీని చూశారు ప్రేక్షకులు. మొత్తానికి ఇప్పటివరకు కమెడియన్‌గా ఉన్న వేణు.. మొదటి సినిమాతోనే ఒక ప్రత్యేక స్థానం నమ్మకం సంపాదించుకున్నాడు. దీంతో వేణు దర్శకుడిగా బిజీ అవుతాడని, బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తాడని అంతా అనుకున్నారు. కానీ..

Also Read : Devika-Danny: రొమాంటిక్ అండ్ థ్రిల్లింగ్ వెబ్ సిరీస్ తో రాబోతున్న రీతు వర్మ..

ఆయన ‘ఎల్లమ్మ’ అనే సినిమాను చేయాలనే సంకల్పంతో గత ఏడాది కాలంగా అదే స్క్రిప్ట్‌తో హీరోల చుట్టూ తిరుగుతున్నట్లు తెలుస్తోంది. ముందుగా ఈ కథను నానికి వినిపించాడని, ఆయన ఆసక్తి చూపించినప్పటికి ఫైనల్‌ వర్షన్‌ నచ్చక పోవడంతో సున్నితంగా తిరస్కరించారట. దాంతో ఈ కథ తో శర్వానంద్‌ వద్దకు వేణు వేళ్లారట. ఆయన సైతం తిరస్కరించారని తెలుస్తోంది. హనుమాన్ హీరో తేజ సజ్జా ఆసక్తి చూపించినా, ఇతర కమిట్‌మెంట్స్ వల్ల ఇప్పట్లో చేయలేను అన్నారట. దీంతో ఫైనల్‌గా నితిన్ వద్దకు చేరుకుంది. ఆయన పూర్తి కథ విన్న తర్వాత ఓకే అన్నారు, త్వరలోనే ఒప్పందాలు సైతం పూర్తి అవ్వబోతున్నాయట. ఇందులో భాగంగా తాజాగా వేణు ఈ మూవీకి సంబంధించిన అప్ డేట్ ఇచ్చారు.. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ‘ఎల్లమ్మ’ అంటూ స్క్రిప్ట్ బుక్ పట్టుకుని పిక్ షేర్ చేశాడు వేణు. మొత్తానికి గట్టిగా ప్లాన్ చేశాడు. రెండో సినిమా కూడా భారీ విజయం సాధించేలా ఉంది.

 

Exit mobile version