NTV Telugu Site icon

Venkatesh: భార్య ఉండగా ప్రియురాలుతో వెంకీ మామ పోరాటం.. మ్యాటర్ ఏంటంటే..?

Untitled Design (28)

Untitled Design (28)

భగవంత్ కేసరి చిత్రంతో మూస కథలు, ఫోర్స్ డ్ కామెడీకి స్వస్తి పలికాడు డైరక్టర్ అనిల్ రావిపూడి. బాలయ్యను సరికోత్తగా చూపించి ఆశ్చర్య పరిచాడు. తననుండి ఇక నుండి కంటెంట్ బేస్డ్ సినిమాలు వస్తాయని ఇటివల తెలిపాడు అనిల్. ఈ తరుణంలో మరొక సీనియర్ విక్టరీ వెంకీతో మరొక చిత్రాన్ని మెుదలు పెట్టాడు. విభిన్న కథ,కధనంతో తెరకెక్కించేలా ప్లాన్ చేస్తున్నాడు ఈ ఒంగోలియన్. గతంలో వెంకీ మామకు రెండు సూపర్ హిట్లు అందించాడు ఈ కుర్ర డైరక్టర్.తాజా చిత్రాన్ని కూడా పర్ఫెక్ట్ గా తెరకెక్కించి హ్యాట్రిక్ హిట్ అందించాలని ఉవ్విళ్ళూరుతున్నాడు రావిపూడి..

Also Read: Tollywood : సినిమా అవకాశాల పేరుతో యువతిపై అసిస్టెంట్ డైరెక్టర్ అత్యాచారం

ఇటీవల పూజా కార్యక్రమాలతో ఈ చిత్రాన్ని ప్రారంభించి ఇతర నటీనటుల సీన్స్ పూర్తి చేసారు. రెండో షెడ్యుల్ ను ఆగస్ట్ 9 నుండి పొల్లాచిలో మెుదలు పెట్టనున్నారు. హీరో విక్టరీ వెంకీ మామ ఈ షెడ్యుల్ నుండి చిత్ర షూటింగ్ లో జాయిన్ అవుతారు.రీసెంట్ గా హైదరాబాద్ లో ఈ చిత్రంలో వెంకీ లుక్ కు సంభందించిన ఫోటో షూట్ చేశారు. ఈ చిత్రంలో వెంకటేశ్ EX పోలిస్ అధికారిగా కనిపించనున్నారు. ఈ చిత్రంలో ఐశ్వర్య రాజేష్ విక్టరీ భార్య పాత్రలో కనిపిస్తుండగా, అందాల తార టాలివుడ్ లో స్టార్ హీరోల సరసన నటిస్తోన్న మీనాక్షీ చౌదరి వెంకీ ప్రియురాలి పాత్రలో కనిపించనుంది. హీరో..భార్య.. మాజీ ప్రేయసి కథనంతో ట్రైయాంగిల్ క్రైమ్ ఎంటర్టైనర్ గా రానుంది. SVC బ్యానర్ లో 58వ చిత్రంగా రానున్న భారీ బడ్జెట్ లో నిర్మాత దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం రానా..నాయుడు షూటింగ్ ముగించే పనిలో ఉన్నాడు దగ్గుబాటి హీరో..

Show comments