NTV Telugu Site icon

VenkyAnil -3 : సంక్రాంతికి వస్తున్నాం.. రమణ గోగుల పాడిన సాంగ్ రిలీజ్

Sankranthikivasthunam

Sankranthikivasthunam

వెంకటేశ్‌ హీరోగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్నసినిమా ‘సంక్రాంతికి వస్తున్నాం’ఈ చిత్రంలో వెంకటేష్ భార్యగా ఐశ్వర్య రాజేష్ నటిస్తుండగా, మీనాక్షి చౌదరి లేడి పోలీస్ గా కనిపించనుంది శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై శిరీష్‌, దిల్ రాజు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాను సంక్రాంతి సందర్భంగా జనవరి 14న రిలీజ్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ ను మొదలు పెట్టారు మేకర్స్.

అందులో భాగంగానే ఈ సినిమాలోని ‘గోదారి గట్టుమీద రామసిలకవే గోరింటాకు ఎట్టుకున్న సందమామవే’ సాగె ఫస్ట్ లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేసారు మేకర్స్. ప్రముఖ పాటల రచయిత భాస్కరభట్ల ఈ సాంగ్ ను రచించగా భీమ్స్‌ సిసిరోలియో సంగీతం అందించారు. చాలా కాలం సినిమాలకు దూరంగా ఉన్న ఒకప్పటి సెన్సేషన్ మ్యూజిక్ డైరెక్టర్ రమణగోగుల ఈ పాట పాడడం విశేషం. ఆయనతో పాటు మధు ప్రియా ఈ సాంగ్ పాడింది. అనుకున్నట్లుగానే పాట చాలా బాగుంది. క్యాచీ ట్యూన్ కుదిరింది. లిరిక్స్ కూడా బాగున్నాయి. అలాగే ఈ పాటలో వెంకీ, ఐశ్వర్య డాన్స్ కూడా బాగుంటుందని యూనిట్ చెప్తోంది. ట్రైయాంగిల్లవ్ స్టోరీ గా వస్తున్న ఈ సినిమాలో ఉపేంద్ర లిమాయే, రాజేంద్రప్రసాద్, సాయికుమార్, నరేశ్, వీటీవీ గణేశ్, మురళీధర్‌ గౌడ్, పమ్మి సాయి తదితరులు నటిస్తుంన్నారు. ఈ సంక్రాంతి పర్ఫెక్ట్ పండగ సినిమాగా సంక్రాంతికి వస్తున్నాం నిలుస్తుందని టీమ్ చాలా నమ్మకంగా ఉన్నారు. రమణగోగుల గాత్రం అందించిన ఈ గోరింటాకు ఎట్టుకున్న సందమామవే సాంగ్ ను మీరు ఓ సారి వినేయండి.

Also Read : Pushpa – 2 : ఆ ఇద్దరి BGM వర్క్ ను పక్కన పెట్టిన పుష్ప-2 మేకర్స్

Show comments