NTV Telugu Site icon

Venkatesh: హీరోల రెమ్యునరేషన్ పై వెంకటష్ షాకింగ్ కామెంట్స్

Venka

Venka

హీరోల కలెక్షన్స్ గురించి విక్టరీ వెంకటేష్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాతో హిట్ కొట్టాడు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఈ సినిమాని దిల్ రాజు సోదరుడు శిరీష్ నిర్మించాడు. దిల్ రాజు సమర్పించిన ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ రోజుకి ఈ సినిమా 230 కోట్లు కలెక్షన్లు సాధించగా తాజాగా దీనికి సంబంధించిన ప్రెస్ మీట్ నిర్వహించారు సినిమా యూనిట్. ఈ కార్యక్రమానికి సినిమా హీరో వెంకటేష్ తో పాటు దర్శకుడు అనిల్ రావిపూడి అదే విధంగా సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో హాజరయ్యారు. ఇక ఈ క్రమంలో ఐటీ రైడ్స్ గురించి చర్చలు జరిగాయి. ఈ సందర్భంగా ఒక రిపోర్టర్ పలువురు నిర్మాతలు ఈ ఐటీ రైడ్స్ గురించి మాట్లాడుతూ హీరోలు అందరూ రెమ్యూనరేషన్ బ్లాక్ లో కాకుండా వైట్లో తీసుకుంటే తమకు చిక్కులు తగ్గుతాయని చెప్పుకొచ్చారని అన్నారు.

Akshay Kumar: ఆ సినిమాల నుంచి నన్ను కావాలనే తప్పించారు: అక్షయ్ కుమార్

దానికి వెంకటేష్ స్పందిస్తూ అందరి హీరోల సంగతి నాకు తెలియదు నేను మాత్రం తీసుకునేది కొంచమే, ఆ కొంచెం కూడా వైట్ లో తీసుకుంటాను అలాగే రోజువారి ఖర్చులకోసం కూడా తీసుకుంటాను అంటూ ఆయన కామెంట్ చేశారు. తనకు ఇతర హీరోలకు కోరిక లేదని అంటూ ఆయన కామెంట్ చేశారు. గత కొద్ది రోజులుగా తెలుగు సినీ పరిశ్రమలో ఉన్న టాప్ సినీ నిర్మాతల మీద ఐటి శాఖ అధికారులు దాడులు చేశారు. గత రెండు మూడు రోజుల నుంచి వారి మీద సోదాలు చేస్తున్నారు. దర్శకుడు సుకుమార్ వెంట కూడా ఐటీ రైడ్స్ జరపడం చర్చనీయాంశమవుతోంది.