పవర్ స్టార్ పవర్ కళ్యాణ్ హరిహర వీరమల్లు రెండు రోజుల క్రితం థియేటర్స్ లో అడుగుపెట్టింది. కానీ ప్రీమియర్స్ నుండే మిక్డ్స్ రెస్పాన్స్ రాబెట్టిన ఈ సినిమా తొలి రోజు వరల్డ్ వైడ్ గా రూ. 70 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టినట్టు ట్రేడ్ అంచనా వేసింది. నైజాం వంటి ఏరియాలలో ప్రీమియర్స్ తోనే రూ. 5 కోట్లు రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది. అటు ఏపీలోను ఉత్తరాంధ్ర, తూర్పు గోదావరి వంటి ఏరియాస్ లో ఆల్ టైమ్ రికార్డ్ నంబర్ గ్రాస్ తో స్టార్ట్ చేసాడు వీరమల్లు.
Also Read : Nara Rohith : నారావారి అబ్బాయ్ సినిమాకు ‘హాట్ స్టార్’ భారీ ప్రైజ్
కానీ నెగిటివ్ టాక్ సినిమా వసూళ్లపై గట్టి ప్రభావం చూపింది. మొదటి రోజు కాస్త గుడ్ హోల్డ్ చేసిన వీరమల్లు రెండవ రోజు భారీ డ్రాప్ కనిపించింది. అందుతున్న సమాచారం ప్రకారం కృష్ణ జిల్లా రూ. 27 . 82లక్షలు షేర్ రాబట్టింది. వెస్ట్ గోదావరి జిల్లా రూ.16 . 55 లక్షలు (షేర్) నెల్లూరు జిల్లా రూ. 6 లక్షలు షేర్, గుంటూరు. రూ. 19 లక్షలు షేర్ రాబట్టిందని సమాచారం అందుతోంది. మిగిలిన ఏరియాలు తెలియాల్సి ఉంది. ఇక ఇండియా వారీగా రెండవ రోజు కేవలం అటు ఇటుగా రూ. 8కోట్లు మాత్రమే వసూలు చేసింది. మొదటి రోజు రూ. 70 కోట్లు రాబట్టి రెండవ రోజు కేవలం రూ. 8 కోట్లు అంటే వీరమల్లు భారీగా డ్రాప్ అయ్యాడు అని ట్రేడ్ భావిస్తోంది. అటు ఓవర్సీస్ లోను భారీ డ్రాప్ కనిపించింది. నేడు, రేపు వీకెండ్.. సో ఈ రెండు రోజులు భారీ కలెక్షన్స్ రాబట్టాలి లేదంటే బయ్యర్స్ కు భారీ నష్టాలు తప్పవు.
