Site icon NTV Telugu

Vedam : అల్లు అర్జున్ ఎమోష‌న‌ల్ పోస్ట్..

Allu Arjun

Allu Arjun

అల్లు అర్జున్ కెరీర్‌ ను మలుపుతిప్పిన చిత్రాల‌లో ‘వేదం’ ఒక్కటి. క్రిష్ ద‌ర్శక‌త్వంలో వచ్చిన ఈ చిత్రం 2010 జూన్ 04న ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్సాఫీస్ వ‌ద్ద మంచి విజయాన్ని న‌మోదు చేసుకుంది. అల్లు అర్జున్ తో పాటుగా మంచు మనోజ్, అనుష్క, లేఖా వాషింగ్టన్ ప్రధాన పాత్రలు పోషించగా ప్రతి ఒక్కరి నటనకు మంచి మార్కులు పడ్డాయి. ముఖ్యంగా అప్పటికే స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న అనుష్క ఈ మూవీ వేశ్య పాత్రలో కనిపించి కోసం పెద్ద రిస్క్ చేసింది. తమిళంలోను రీమేక్ చేశారు. అయితే తాజాగా ఈ సినిమా వ‌చ్చి నేటికి 15 ఏండ్లు పూర్తి చేసుకుంది. ఈ సంద‌ర్భంగా సినిమాను గుర్తు చేసుకుంటూ అల్లు అర్జున్ ఎమోష‌న‌ల్ పోస్ట్ పెట్టాడు.

Also Read : Abhirami : 42 ఏళ్ల వయసులోనూ .. తరగని అందంతో అభిరామి..

‘‘వేదం’ మూవీ నా కెరీర్‌లో ఒక విభిన్నమైన చిత్రం. ఈ సినిమాను ఎంతో నిజాయితీగా తీసినందుకు దర్శకుడు క్రిష్ జాగర్లమూడికి నా కృతజ్ఞతలు. అలాగే నాతో పాటు నటించిన అనుష్క శెట్టి, మంచు మనోజ్, మనోజ్ బాజ్‌పాయ్‌తో పాటు ఇతర నటీనటులతో కలిసి పని చేయడం ఎంతో ప్రత్యేకం. ఈ సినిమాను నిర్మించిన శోబు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేనికి, సంగీతం అందించిన ఎం.ఎం. కీరవాణికి, ఇంకా చిత్రబృందం మొత్తానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు . చివరగా, ఈ సినిమాను ఆదరించి, ఎప్పటికీ నిలిచిపోయే చిత్రంగా మార్చిన అభిమానులందరికీ కృతజ్ఞతలు’ అని తెలిపారు అల్లు అర్జున్ అలాగే ఈ మూవీ టైం ఫోటోలు కూడా పంచుకున్నాడు.

 

Exit mobile version