Site icon NTV Telugu

VB Entertainments: ఘనంగా ఫిల్మ్ అండ్ టీవీ డైరెక్టరీ డిజిటల్ మీడియా అవార్డ్స్

Vb Ent

Vb Ent

డిజిటల్ మీడియా రంగంలో అత్యుత్తమ ప్రతిభను ప్రదర్శించిన వారిని గౌరవించేందుకు ‘VB ఎంటర్‌టైన్‌మెంట్స్ డిజిటల్ మీడియా అవార్డ్స్-2025’ వేడుక జరిగింది. ఈ కార్యక్రమంలో డిజిటల్ మీడియా రంగంలోని వివిధ విభాగాల్లో విజేతలు అవార్డులను అందుకున్నారు. VVK సంస్థ సమర్పణలో, VB ఎంటర్‌టైన్‌మెంట్స్ ఆధ్వర్యంలో నిర్వహించబడిన ఈ వేడుకకు ‘VB ఎంటర్‌టైన్‌మెంట్స్’ అధినేత మరియు ‘ఈసీ మెంబర్ ఆఫ్ మా’ అయిన విష్ణు బొప్పన ఫౌండర్‌గా వ్యవహరించారు. విజేతలు అవార్డులను స్వీకరించి, తమ సంతోషాన్ని పంచుకున్నారు. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు మరియు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. సీనియర్ నిర్మాత అంబికా కృష్ణ గారి చేతుల మీదుగా విజేతలకు అవార్డులు అందజేయబడ్డాయి.

ఈ సందర్భంగా అంబికా కృష్ణ గారు మాట్లాడుతూ, విజేతలకు కృతజ్ఞతలు తెలిపారు. డిజిటల్ మీడియా ప్రింట్ మీడియా కంటే ఎంతో అభివృద్ధి చెందిందని, ప్రజలకు మరిన్ని సానుకూల వార్తలను అందించాలని తాను కోరుకుంటున్నానని అన్నారు. విష్ణు బొప్పన గారి గురించి కూడా ప్రస్తావిస్తూ, ఆయన చేసిన సేవా కార్యక్రమాలను ప్రశంసించారు. గత 10 సంవత్సరాలుగా చిన్న పిల్లలకు విష్ణు గారు అనేక విధాలుగా సహాయం చేశారని, అనాధ పిల్లలకు ఆసరాగా నిలిచారని గుర్తు చేశారు. అలాగే, VB ఎంటర్‌టైన్‌మెంట్స్ ద్వారా ప్రతి సంవత్సరం సామాజిక అవగాహన కల్పించిన వారిని సన్మానించడం అభినందనీయమని అన్నారు.
అనంతరం విష్ణు బొప్పన గారు మాట్లాడుతూ, ముఖ్య అతిథులుగా హాజరైన అంబికా క…

Exit mobile version